థర్డ్ వేవ్ టెన్షన్ .. ఎంత భయంకరంగా ఉంటుందో , జాగ్రత్త !

Update: 2021-05-28 09:30 GMT
భారత్‌ కి కరోనా ధర్ఢ్‌ వేవ్‌ ముప్పు పొంచివుందా అనే అంశంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్ తీవ్ర విధ్వంసం సృష్టిస్తొంది. ప్రతీ రోజుల నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత రోజురోజుకి కరోనా వైరస్ కేసులు అయితే తగ్గుతూ వస్తున్నాయి. దాదాపుగా 44 రోజుల తర్వాత అత్యంత తక్కవ కేసులు నమోదు అయ్యాయి.  లాక్ డౌన్‌  తోనే దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తుందని పలువురు నిపుణులు చెప్పడం తో ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి.

ఈ క్రమంలో సెకెండ్ వేవ్  జూన్ మద్యానికి తగ్గుముఖం పట్టవచ్చని వైద్య వర్గాలు, శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. అయితే.. ఆ తర్వాత థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి వుందని చెబుతున్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలలో నాల్గవ వేవ్‌  సైతం వచ్చిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో థర్ఢ్‌ వేవ్‌ 2021 నవంబర్‌ చివర్లో లేదా డిసెంబర్‌ లో రావచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌ లో థర్డ్‌ వేవ్‌ తప్పదని కేంద్ర ప్రభుత్వం కూడా అంఛనా వేస్తోంది. ఈ థర్ఢ్‌ వేవ్‌ పిల్లలు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ వైరస్‌ ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే సరైన మార్గంమంటున్నారు. సెకండ్‌ వేవ్‌ నియంత్రణకు ఇప్పటికే పలు రాష్ట్రాలలో అమలవుతున్నకఠిన ఆంక్షలు, లాక్‌ డౌన్‌ అమలవుతున్నారు. రానున్న రోజుల్లో మరి కొన్ని వేవ్‌ లు తప్పవంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీనితో ఆస్పత్రిలో చిన్నపిల్లల కోసం బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక యూపీలో 12 సంవత్సరాల లోపు పిల్లలకి త్వరగా వ్యాక్సిన్లు ఇస్తామని అంటున్నారు. అలాగే గోవాలో గోవా ప్రభుత్వం పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పింది.

2020లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారలేదు. కానీ 2021లో పెరిగిన కేసుల వేగం, పిల్లలు, యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. జరుపుతున్న పరీక్షల్లో పాజిటివ్  శాతం కూడా బాగా పెరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య రుజువు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వైరస్‌ లో మ్యుటేషన్   జరిగినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా వుంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకోని జనాభాపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సమాచారం. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. పిల్లల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం ఎలా వుంటుందనే అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. థర్డ్ వేవ్ రాకుండా ప్రజలందరు అప్రమత్తంగా వుండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News