బాలికల విద్య కోసం కృషి చేస్తున్న బాలికల హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. గతేడాది భారత దేశానికి చెందిన పిల్లల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్దితో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మాలలా కు, అమెరికాకు చెందినా అంతరిక్ష పరిశోదన సంస్థ "నాసా" అరుదైన ఘనతను ఇచ్చింది. దీంతో చరిత్రలో మరో సారి మలాలా పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.
కాలిపోర్నియాలోని నాసా శాస్త్రవేత్తలు 316201 అనే ఉల్కకు మాలలా పేరును పెట్టారు. మహిళల కోసం కృషి చేసిన మహిళకు ఈ గౌరవం లభించడం చాలా అరుదైన విషయమని నాసా వర్గాలు తెలిపాయి. బాలిక విద్యకోసం కృషి చేయడమేకాకుండా బాలికల విద్య వ్యాప్తికి ఉగ్రవాదుల ఆదేశాలను సైతం ఎదురించినందుకు... ఆమె సాహసోపేతమైన దృడ సంకాల్పానికి గుర్తుగా ఈ ఉల్కకు మలాలా పేరు పెట్టామని నాసా శాత్రవేత్తలు తెలిపారు.