ఇదే మన గొప్పతనం.. హిందూ మఠానికి ముస్లిం ప్రధాన అర్చకుడు

Update: 2020-02-21 10:15 GMT
హిందూముస్లింలు సోదరులు.. అనే ప్రధాన సూత్రం మన దేశంలో ఉంది. అందుకే ఒకరి పండుగలను మరొకరు చేసుకుంటూ పరమత సహనం పాటిస్తుంటాం. అందుకే భారతీయులకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేకత ఉంది. అయితే తాజాగా ఓ ముస్లిం వ్యక్తి హిందూ మతానికి చెందిన ఓ మఠానికి ఏకంగా ప్రధాన అర్చకుడిగా నియమితులవడం విశేషం. కర్నాటక రాష్ట్రం గడగ్‌ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠానికి 33 ఏళ్ల ముస్లిం యువకుడు దివాన్ షరీఫ్ రహీం సాహెబ్ ముల్లా నియమితులయ్యాడు.

బసవేశ్వరుడి బోధనలను తొలి నుంచి విశ్వసిస్తున్న దివాన్‌ షరీఫ్‌ ముల్లాకు మఠాధిపతి గోవింద్‌ భట్‌ జంధ్యాన్ని ధరింపజేసి మఠం బాధ్యతలను అప్పగించారు. మఠానికి చెందిన కజురి స్వామిజీ కూడా సంప్రదాయం ప్రకారం ఇష్ట లింగాన్ని దివాన్‌కు అందజేశారు. 350 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కలబురగి జిల్లా కజురి మఠానికి అనుబంధంగా అసుటి మఠం కొనసాగుతోంది. చిత్రదుర్గలోని శ్రీజగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361 శాఖల్లో గడగ్‌లోని లింగాయత్‌ మఠం ఒకటి. కజురి మఠాధిపతి మురుఘరాజేంద్ర కోరనేశ్వర శివయోగి రహీమ్ కు దీక్షనిచ్చారు. చిన్ననాటి నుంచి బసవ తత్వాలకు ఆకర్షితుడైన రహీం సామాజిక న్యాయం కోసం శ్రమిస్తున్నారు. అయితే ఈ అసుటి మఠానికి గతంలో రహీం తండ్రి రహీంసాహెబ్ రెండెకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. అక్కడి స్వామీజీల బోధనలకు ఆకర్షితులైన దివాన్‌ షరీఫ్‌ ముల్లా తల్లిదండ్రులు.. ఆ మఠానికి రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. షరీఫ్‌

ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. తాను మఠం బాధ్యతలు చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని చెప్పారు. బసవ బోధనలను మరింతంగా ప్రచారం చేస్తానని, నీ కులం, మతం ఏమిటన్నది ప్రధానం కాదు. దేవుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మనుషులు సృష్టించిన కులమతాలనేవి అడ్డంకులు కావు అని శ్రీ మురుగరాజేంద్ర కొరానేశ్వర స్వామి తెలిపినట్లు వెల్లడించారు.
Tags:    

Similar News