కరోనా బాధితుల్లో రక్త గడ్డకట్టడానికి కారణమిదే

Update: 2021-06-16 03:33 GMT
కరోనా సోకినవారి రక్తంలో ప్రాణాంతక గడ్డలు ఏర్పడటానికి గల కారణాలను ఐర్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా కొత్త చికిత్స విధానాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పించింది.రక్తం గడ్డకట్టడం వల్ల కరోనా బాదితుల్లో అనేక మంది చనిపోతున్నట్లు ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది.

కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టడానికి గల కారణాన్ని ఐర్లాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలోని వాన్ నిల్ బ్రాండ్ ఫ్యాక్టర్ (వీడబ్ల్యూఎఫ్) అనే పదార్థానికి, ఆ సమస్యను నియంత్రించే ఆడమ్ టీఎస్-13 మధ్య సమతౌల్యం బాగా దెబ్బతింటున్నట్లు తేల్చారు.

వీరిలో వీ.డబ్ల్యూఎఫ్ ఎక్కువగా.. ఆడమ్ టీఎస్13 తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ రెండింటి స్థాయిలను కంట్రోల్ చేసేలా చికిత్స చేస్తే సమస్యకు చెక్ పెట్టొచ్చని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ రెండింటి స్థాయిని సరిచేసేలా చికిత్స విధానాలను రూపొందిస్తే ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని ప్రోటీన్లలో జరుగుతున్న ఇతర మార్పుల వల్ల ఆడడమ్ టీఎస్13 తగ్గిపోతున్నట్లు కూడా గుర్తించినట్లు చెప్పారు.
Tags:    

Similar News