2022 లో ఖతర్ వేదికగా జరిగిన సాకర్ సమరం రెండు రోజుల కిందట ముగిసింది. డిసెంబర్ 18న జరిగిన ఫిఫా-2022 ఫైనల్లో అర్జెంటీనా.. ఫ్రాన్స్ జట్లు పోటీపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో ఇరుదేశాలు కొదమ సింహాలు తలపడ్డాయి. అయితే చివరికి అర్జెంటీనా విజేత నిలిచి ఫుట్ బాల్ జగజ్జేతగా నిలవడంతో ఖతర్ లో సంబురాలు మిన్నంటాయి.
ఈ ప్రపంచ కప్ పైనల్ మ్యాచ్ ముగిశాక అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించారు. ఫిఫా ట్రోఫీని అందుకునే సమయంలో మెస్సీ ‘బిష్ఠ్’తో కన్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ఫిఫా అధ్యక్షుడు ఇన్ ఫాంటినో ఖతార్ చక్రవర్తి షేక్ తమీమ్ బిన్ హమద్ సమక్షంలో తొడిగించారు.
అయితే ఈ ప్రత్యేక వస్త్రాన్ని (బీష్ఠ్) ను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాజ కుటుంబీకులు.. రాజకీయ నేతలు.. మత గురువులు.. ధనికులు తదితరులు ధరిస్తారు. దీనిని వేసుకోవడం ద్వారా హుందాగా.. ప్రత్యేకంగా కన్పిస్తారు. ప్రపంచ కప్ అందుకోవడం అనేది మెస్సీకి ప్రత్యేక సందర్భంగా కాబట్టిని దీనిని మెస్సీకి అందించారు.
మరోవైపు ఈ బీష్ఠ్ ను అరబ్ యుద్ధ వీరులకు.. రాజ వంశస్థులకు దీనిని బహుకరిస్తారని కొందరు చెబుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన మెస్సీ ఫుట్ బాల్ కింగ్ మారాడని అందుకే ఖతర్ సాంప్రదయ బీష్ఠ్ ను మెస్సీకి అందించారని తెలుస్తోంది.ఇదే విషయంపై ఖతార్ టోర్ని నిర్వాహక కమిటీ కార్యదర్శి హసన్ అల్ థవాడీ మాట్లాడారు.
‘‘అధికారిక.. ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ వస్త్రాన్ని(బీష్ఠ్) ధరిస్తారు.. ఇది మెస్సీ సంబరాల సందర్భం.. అందుకే దీనిని అతనికి బహుకరించాం.. అరబ్.. ముస్లిం సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు ఈ మెగా టోర్నో మాకు అవకాశాన్ని కల్పించిందని’’ వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.