గత కొద్దికాలంగా..ప్రతీ వీకెండ్‌లో చంద్రబాబు హైదరాబాద్‌కు రావడం, ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ నాయకులకు, పార్టీ వర్గాలకు అందుబాటులో ఉండడం...ఈ మేరకు ఫోటోలు విడుదలవడం...తెలిసిన సంగతే. తెలంగాణలోపార్టీ అంతరించిపోయిందన్న ప్రచారాన్ని ధీటుగా తిప్పి కొట్టాలని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను పెంచాలని చంద్రబాబు చెప్పారని పార్టీ లీకులు ఇస్తోంది. అయితే...ఆ లీకుల్లో వాస్తవం ఏంటో...ఈ ఒక్క ఫొటో చెప్తోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. పార్టీకి ఒకప్పుడు అండగా ఉన్న వర్గాలు, నాయకులు అంతా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పడమే నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో...చంద్రబాబు నిర్వహించిన సమావేశం, ప్రత్యేక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి...తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలోని ఓ ఫోటో స్పష్టం చేస్తోంది. పట్టుమని పదిమంది నేతలు కూడా లేకుండా...చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అందులో చెప్పుకోదగ్గ నేతలు...ఒక్కరూ లేరు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, విలేకరుల సమావేశంలో కనిపించే నర్సిరెడ్డి తప్ప. ఈ ఇద్దరు నేతలు, నందమూరి సుహాసినితో పాటు మరో పదిమందితో....చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో ఇంత ఘోరంగా ఉంటే...ఆ పార్టీ ఇచ్చిన పత్రికా ప్రకటన, లీకులు మాత్రం...ఆహా ఓహో అన్నట్లుగా ఉండటం గమనార్హం. తెలంగాణలో పార్టీ కొనసాగించడంపై చంద్రబాబు సీరియస్ నిర్ణయాలు తీసుకున్నారట. త్వరలో జరిగే మునిసిపిల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు చెప్పారట. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నినిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో ముందుగా కమిటీలను వేద్దామని ఆయన చెప్పారట. బాబు తమకు సమయం కేటాయించడం సంతోషంగా ఉందని, పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని నేతలు భావిస్తున్నారట. ఇదండి...తెలుగుదేశం పార్టీ పరిస్థితి...ఆ పార్టీ మీడియాకు ఇస్తున్న సమాచారం పరిస్థితి.