లాక్ డౌన్ తో ఆ జిల్లాలన్ని సేఫ్

Update: 2020-04-14 02:30 GMT
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ దేశ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. కరోనా కేసులు వెలుగు చూస్తున్న వేళలోనే లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా.. దేశంలో కేసుల్ని కంట్రోల్ చేయటం లో మోడీ సర్కారు సక్సెస్ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా కొత్త గణాంకాలు బయటకు వచ్చాయి.

లాక్ డౌన్ కారణంగా దేశంలోని పదిహేను రాష్ట్రాల్లోని పాతికజిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు నమోదు కాలేదని చెబుతున్నారు. ఒక విధంగా లాక్ డౌన్ ఆయా జిల్లాల్ని సేవ్ చేసి సేఫ్ గా మార్చాయన్న మాట వినిపిస్తోంది. నిజానికి లాక్ డౌన్ ను ఒక వారం ముందే విధిస్తే.. ఈ రోజు పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని చెబుతున్నారు. లాక్ డౌన్ కారణం గా పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాలు రాష్ట్రాల వారీగా చూస్తే..

మహారాష్ట్ర
% గోండియా
ఛత్తీస్ గఢ్
% రాజ్ నంద్ గావ్
% దుర్గ్
% బిలాస్ పూర్
కర్ణాటక
% దేవన్ గిరి
% కొడగు
% తుంకూరు
% ఉడిపి
గోవా
% సౌత్ గోవా
కేరళ
% వయనాడ్
% కొట్టాయం
మణిపూర్
% పశ్చిమ ఇంఫాల్
జమ్ముకశ్మీర్
% రాజౌరీ
మిజోరం
% ఐజ్వాల్ వెస్ట్
పుదుచ్చేరి
% మాహె
పంజాబ్
% ఎస్ బీఎస్ నగర్
బిహార్
% పాట్నా
% నలందా
% ముంగర్
రాజస్థాన్
% ప్రతాప్ గఢ్
హర్యానా
% పానిపట్
% రోహతక్
% సిర్సా
ఉత్తరాఖండ్
% పారీ గర్వాల్
తెలంగాణ
% భద్రాద్రి కొత్తగూడెం
Tags:    

Similar News