కరోనా టీకాల పై తాజా పరిశోధన.. ఏం తేలిందంటే?

Update: 2021-04-16 23:30 GMT
కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులకు ఒకే టీకా మోతాదు అవసరమని.. కోవిడ్ -19 సోకనివారికి బలమైన రోగనిరోధక శక్తిని పెంపొదించడానికి రెండో డోస్ కూడా వేసుకోవాల్సి ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.  అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా చేసిన ఈ అధ్యయనంలో, కోవిడ్ సోకి ప్రాణాలతో బయటపడినవారికి మొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మోతాదు వేసిన తర్వాత బలమైన యాంటీబాడీలు తయారయ్యాయని కనుగొన్నారు, అయితే రెండో మోతాదు తర్వాత తక్కువ రోగనిరోధక ప్రయోజనం కనిపించిందని తేల్చారు..

మరోవైపు కోవిడ్ -19 సోకనివారికి, వారి రెండవ టీకా మోతాదును స్వీకరించే వరకు పూర్తి రోగనిరోధక ప్రతిస్పందనలు లేవని గుర్తించారు. బలమైన స్థాయి రోగనిరోధక శక్తిని సాధించడానికి కరోనా సోకని వారు ఖచ్చితంగా రెండు మోతాదులను వేసుకుంటేనే వారి ఆరోగ్యం బలోపేతం చేస్తుందని తేలింది.

  రోగనిరోధకపరంగా తక్కువ సామర్థ్యం ఉన్నవారు.. దీర్ఘకాలిక రోగులు  కరోనాను తట్టుకోవడానికి ఖచ్చితంగా రెండు మోతాదులు వేసుకోవాలని అధ్యయనంలో తేలింది. టీకా ద్వారా ప్రేరేపించబడిన ప్రతిరోధకాలు అంటువ్యాధుల నుంచి.. ప్రాణాంతకమైన దక్షిణాఫ్రికా కరోనా రకం నుంచి కూడా రక్షించగలవని పరిశోధకులు తెలిపారు.

టీకాలు వేసుకుంటే మానవ రోగనిరోధక ప్రతిస్పందన రెండు  రకాల ఫలితాలను ఇస్తుందని తేలింది. వేగవంతమైన రోగనిరోధక శక్తిని అందించే ప్రతిరోధకాల ఉత్పత్తిని పెంచుతుందని తేలింది. B కణాల సృష్టించబడి ఇవి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తికి సహాయపడతాయని కనుగొన్నారు..

అధ్యయనం కోసం ఈ బృందం అమెరికా టీకాలైన బయోఎంటెక్ / ఫైజర్ లేదా మోడెర్నా ఎంఆర్ఎన్ఏ కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న 44 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై పరిశోధన చేశారు.  ఈ పరిశీలనలో  కరోనా సోకని రోగులలో రెండవ టీకా మోతాదు తర్వాత ఒక వారం గరిష్ట స్థాయికి రోగనిరోధక చేరిందని తేలింది. కాని కరోనా నుంచి కోలుకున్న రోగులలో మొదటి మోతాదు తర్వాత రోగ నిరోధక శక్తి బాగుందని కనుగొన్నారు.
Tags:    

Similar News