'కోటి' ఇవ్వకపోతే అశ్లీల వీడియోలు బయటపెడుతా మంత్రి కుమారుడికి బెదిరిపు

Update: 2022-01-10 08:38 GMT
కర్ణాటక రాజకీయంలో తాజాగా ఓ న్యూస్ కలకలం రేపుతోంది. ఓ మంత్రి కుమారుడి అశ్లీల వీడియోలను బయటపెడుతానని ఓ జ్యోతిశ్యుడు కుమారుడు బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కుమారుడికి సంబంధించిన అశ్లీల వీడియోలను సృష్టించి మంత్రి పీఏలకు ఆ వీడియోలను పంపించారని, ఆ తరువాత డబ్బలు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయయంలో జ్యోతిష్యుడి కుమారుడి పనేనని  మంత్రి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు.

బెంగుళూరుకు చెందిన ప్రముఖ  జ్యోతిష్యుడు చంద్రశేఖర్ భట్ కుమారుడు రాహుల్ భట్..కర్ణాటక సహకార మంత్రి సోమశేఖర్ పీఏలను కలిశాడు. మంత్రికుమారుడు నిశాంత్ కు చెందిన అశ్లీల వీడియోలు తమ దగ్గర ఉన్నాయని ఆ వీడియోలను పీఏ శ్రీనివాస గౌడ, భానుప్రకాశ్ మొబైళ్లకు పంపిచారు. అయితే తాను అడిగిన డబ్బు ఇవ్వాలని, ఆ డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని రాహుల్ బెదరించాడు.

అయితే నిశాంత్ బెంగుళూరు క్రైమ్ పోలీసులను సంప్రదించి రాహుల్ పై ఫిర్యాదు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిశాంత్ ను టార్గెట్ చేస్తూ అశ్లీల వీడియోలను రూపొందించారన్నారు.  ఈ వీడియోలో ఉన్నది తాను కాదని నిశాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలను రాహుల్ మంత్రి పీఏలకు పంపించారని పేర్కొన్నారు.  దీంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు రాహుల్ భట్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాహుల్ భట్ కోటి రూపాయల డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ తన తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కొందరు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్నారు. అయితే ఈ కేసులో ఓ రాజకీయ నాయకుడి కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News