గెలిచినప్పుడు సంబురాలు చేసుకొనే క్రికెట్ అభిమానులు.. ఓడిపోయినప్పుడు సైతం అంతే ఆవేశంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ప్రపంచకప్ లాంటి సందర్బాల్లో ఫ్యాన్స్ రెచ్చిపోతారు. క్రికెటర్ల భార్యలను, పిల్లలను చంపుతాం అంటూ కూడా కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుంటారు. వారు ఆవేశంలో ఉంటారు కాబట్టి.. క్రికెటర్లు కూడా ఆ విషయాన్ని ఆ టైంలో లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సార్లు అభిమానులు ఆవేశపూరిత కామెంట్లు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయి.
ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజమే.. గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం.. ఓడినప్పుడు బెదిరించడం సరికాదు. ఇటీవల సోషల్ మీడియా వ్యాప్తి పెరిగాక.. ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దురభిమానులు కామెంట్లతో క్రికెటర్ల కుటుంబసభ్యులు ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు. దక్షిణాప్రికా క్రికెటర్ డుప్లెసిస్ సైతం ఇటువంటి చేదు అనుభవాలను ఎన్నో ఎదుర్కొన్నారట. ఇటీవల ఓ మీడియా చానల్ లో ఓడిపోయినప్పుడు అభిమానులు ఎలా ప్రవర్తించారో అతడు తన అనుభవాలను పంచుకున్నాడు.
2011 వరల్డ్కప్ లో భాగంగా ఢాకాలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ తో తో తలపడింది. ఈ మ్యాచ్ టైంలో డూప్లెసిస్ కు అతడి భార్యకు ఫ్యాన్స్ నుంచి దారుణమైన బెదిరింపులు వచ్చాయట. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డేనియల్ వెటోరి సారథ్యంలోని కివీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో తడబడ్డ దక్షిణాఫ్రికా 172 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. విధ్వంసకర బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ రన్ అవుట్ కావడంతో పరిస్థితి చేజారింది. దీంతో డుప్లెసిస్ కు అభిమానుల నుంచి దారుణమైన మెసేజ్లు వచ్చాయంట.
'ఆ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం నేను సోషల్ మీడియా ఓపెన్ చేసి షాక్ అయ్యాను. నన్ను నా భార్యను తీవ్ర పదజాలంతో దూషించారు. ఏ క్రికెటర్ కు అయినా ఇటువంటి పరిస్థితి తప్పదేమో' అంటూ డూప్లెసిస్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఇక ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్న డుప్లెసిస్ ప్రస్తుతం ఈ టోర్నీ రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు.