‘రాజుగారి కోట’ ఇష్యూలో ఆత్మహత్యలు

Update: 2016-08-22 08:15 GMT
రాజుగారిని బంధించి.. ఆయన్ను మత్తులో ఉంచి తీవ్ర అస్వస్థతకు గురి చేసినఉదంతం ఈమధ్యన బయటకు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజుగారికి సాయంగా ఉండాల్సిన మేనేజర్ తప్పుడు ఆలోచనలతో వ్యవహరించిన వైనం బయటకు పొక్కి.. ఇప్పుడా ఇష్యూ పోలీసు విచారణలోఉన్న ఉదంతంలో ఇప్పుడు ఊహించని మలుపు చోటు చేసుకుంది.

ఒడిశాలోని పర్లాకిమిడి రాజకోటలో మహారాజు గోపీనాథ గజపతిని బంధీగా చేసిన వైనం వెలుగులోకి వచ్చి ఆయన్ను రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. ఈ ఎపిసోడ్ లో దోషులుగా ఉన్న మేనేజర్.. అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యలు చేసుకోవటం షాకింగ్ గా మారింది. రాజకోటలో మహారాజు బంధీ ఎపిసోడ్ విషయం ఒక కొలిక్క రాకముందే ఈ ఘటనలో బాధ్యులైన వారుగా భావిస్తున్న మేనేజర్.. కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.  

మహారాజు గోపీనాథ గజపతి మేనేజర్ గా ఒక మహిళ (ఆనంగి పాత్రో)వ్యవహరిస్తున్నారు. రాజుగారికి అసిస్టెంట్ మేనేజర్ గా ఆమె సోదరుడు పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు.. అనంగి పాత్రో సోదరి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే ఇష్యూలో సూసైడ్ అటెంప్ట్ చేసిన మరో సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తమ అక్రమాలు బయటకు రావటం..తమపై పోలీసుల కన్ను పడటం..విచారణలో తాము చేసిన పనులన్నీ బయటకు వస్తాయన్న భయాందోళనలకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. వారున్నఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో డౌట్ వచ్చిన స్థానికులు పోలీసులకుసమాచారం అందించటంతో వారు ఇంటి తలుపులుబద్ధలు కొట్టగా.. లోపల మృతదేహాలు కనిపించటం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News