పొద్దుపొద్దున్నే లేచిన వెంటనే కాస్తంత బద్ధకం.. మరికాసేపు సేద తీరితే బాగుండన్న భావన మామూలే. అయితే.. అవన్నీ క్షణంలో వదిలిపోవటమే కాదు.. భయంతో వణికిపోయిన ఉదంతం ఒక ఫ్యామిలీకి ఎదురైంది. పొద్దుపొద్దున్నే టెర్రర్ అంటే ఏమిటోచూపించిన ఈ ఉదంతం పలువురిని విస్తు పోయేలా చేస్తుంది. హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన విన్న వారి నోట మాట రాని పరిస్థితి.
హర్యానాలని పింజర్ లోని రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎప్పటి మాదిరే నిద్ర లేచారు. బద్ధకంగా బాల్కనీ వరకూ వచ్చిన వారికి నోట మాట రాని పరిస్థితి. అడుగులు తడబడి.. ఏం జరిగిందో మిగిలిన కుటుంబ సభ్యులకు చెప్పేందుకు సైతం మాటలు రాని పరిస్థితి. బాల్కనీలో పులి ఒకటి నిద్రపోతోందన్న విషయాన్ని గుర్తించి.. కుటుంబ సభ్యులంతా అలెర్ట్ అయిపోయారు.
వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన సదరు రిటైర్డ్ అధికారి ఇంటికి చేరుకున్న వారు.. మత్తు ఇంజెక్షన్ తో దాన్ని బంధించటంతో సదరుకుటుంబ సభ్యులు రిలాక్స్ అయ్యారు. ఇంజెక్షన్ తో బంధించిన పులిని దగ్గర్లోని అడవిలో విడిచి పెడతామని చెప్పారు. ఒకసారి అలవాటు పడిన పులి.. మళ్లీ ఇంటికి వచ్చి పడుకోదు కదా..?