​ఆ సీఎంకు అరుదైన అవకాశం దక్కింది

Update: 2017-01-26 07:50 GMT
ఒక ఆసక్తికర ఘటనకు తమిళనాడు వేదికైంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా అరుదుగా చోటు చేసుకునే ఘటన ఒకటి తమిళనాడులో ఆవిష్కృతమైంది. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జాతీయ పతకాన్ని ఎర్రకోట మీద రాష్ట్రపతి.. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో గవర్నర్ ఎగురవేయటం ఒక సంప్రదాయం. అయితే.. ప్రస్తుతం తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్ లేరన్నది తెలిసిందే.

మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు తమిళనాడు రాష్ట్రానికి ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ముంబయి నుంచి చెన్నైకి రావటం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో గవర్నర్ స్థానే ముఖ్యమంత్రి జెండా వందనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నోటిఫికేషన్ ను ముందుగానే జారీ చేశారు.

దీంతో.. రిపబ్లిక్ డే నాడు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం చేశారు. ఇలాంటి పరిస్థితి తమిళనాడురాష్ట్రంలో ఇప్పటివరకూ చోటు చేసుకోలేదు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్థానే ముఖ్యమంత్రి జెండా వందనం చేయటం తమిళనాడు చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇప్పటివరకూ మూడు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం వ్యవహరించినప్పటికీ.. జాతీయ పతాకావిష్కరణ చేయటం ఇదే తొలిసారి కావటం మరో ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News