ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దానికి సంబంధించిన బీరకాయి పీచు సంబంధమైనా హైదరాబాద్ తో లింకు ఉండటం కామన్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక.. హైదరాబాద్ లో వెలుగు చూసే ఏ చీకటి రొచ్చులో అయినా సినిమా ఇండస్ట్రీకి ఎంతోకొంత సంబంధాలు ఉండటం ఇప్పుడు మామూలు అయిపోతోంది.
మొన్నటికి మొన్న డ్రగ్స్ రాకెట్ ముచ్చట వెలుగు చూడటం.. డ్రగ్స్ తో పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలు ఉండటం.. వారు విచారణ ఎదుర్కోవటం తెలిసిందే. డ్రగ్స్ రచ్చ ఇంకా ఒక కొలిక్కి రాక ముందే.. స్పా.. మసాజ్ పేరుతో వ్యభిచారాన్ని నిర్వహించే వైనం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
థాయ్ మసాజ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. సరికొత్త తీరులో వ్యభిచార గృహాల్ని నిర్వహిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సిద్ధార్థ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొదట నోరు విప్పేందుకు బెట్టు చూపించిన అతగాడిని.. పోలీసులు తమదైన శైలిలో విచారణ షురూ చేసిన వెంటనే.. నోటి నుంచి గుట్టు మొత్తం బయటకు వచ్చేసిందని చెబుతున్నారు.
తాజా స్పా వ్యభిచార రాకెట్ లోనూ సినీ పరిశ్రమకు చెందిన కొందరి హస్తం ఉన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన ఇద్దరితో సిద్దార్థ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. వారిలో ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాగా.. మరొకరు వ్యాంప్ పాత్రలు చేసే నటిగా తెలుస్తోంది.
ఒక రియాలిటీ షోలో నటించిన ఈ ఇద్దరూ.. స్పా కోసం వచ్చే సన్నిహితులు. వీఐపీ కస్టమర్ల కోసం వెండితెర.. బుల్లితెరకు సంబంధించిన కొందరిని సప్లై చేసినట్లుగా తెలుస్తోంది. వీరే కాక కొందరు జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నట్లుగా సమాచారం. విచారణలో భాగంగా సిద్దార్థ్ కొందరి పేర్లను వెల్లడించినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ తో లింకు ఉన్న ఒక సినీ నటి గతంలో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి తరచూ పార్టీలకు బయటకు వెళ్లేవాళ్లమని.. ఇలాంటి వ్యవహారాల్లో గ్లామర్ టచ్ తప్పనిసరి అని సిద్ధార్థ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అమ్మాయిల్ని తీసుకొని విదేశాలకు వెళితే తెలిసిపోతుందని.. అదే స్టార్ట్ హోటళ్లలో బస చేసినా అందరికి తెలుస్తుందని.. అదే మసాజ్ సెంటర్లలో అయితే.. గుట్టుగా ఉండిపోతుందని.. అక్కడి పని చేసేవారిలో ఎక్కువ మంది ఈశాన్య ప్రాంతానికి చెందిన వారు.. విదేశాలకు చెందిన వారు కావటంతో ఇక్కడి సెలబ్రిటీల గురించి వారికి అవగాహన తక్కువ ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి.. ఈ స్పా రాకెట్ లో సంబంధం ఉన్న సినీ సెలబ్రిటీల విషయంపై పోలీసులు మరింత లోతుగా దృష్టి సారిస్తారా? లేదా? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పాలి.