కేరళలో విజృంభిస్తున్న టమాటో ఫీవర్.. చిన్నారులే టార్గెట్

Update: 2022-05-12 02:16 GMT
దేశంలో మరో మహమ్మారి పుట్టుకొచ్చింది.చిన్నారులనే టార్గెట్ చేసింది. దేశంలో ఓవైపు కరోనా విజృంభిస్తూనే ఉంది. కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ తాజాగా కేరళలో మరో వ్యాధి  భయాందోళనలు సృష్టిస్తోంది. అదే టమాటో ఫీవర్. ఇప్పటివరకూ అక్కడ 80 మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారు.

ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ వైరస్ సోకింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ కారణంగా కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న కారణంతో సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించారు.  

కోయంబత్తూర్ లోకి ప్రవేశించే వారికి ముమ్మరంగా టెస్ట్ లు చేస్తున్నారు. ఇద్దరు వైద్యాధికారులతో కూడిన బృందం అటువైపుగా వెళుతున్న వాహనాల్లోని పిల్లలను పరీక్షిస్తున్నారు. అలాగే అంగన్ వాడీల్లో ఐదేళ్లలోపు పిల్లలను తనిఖీ చేసేందుకు 24 మంది సభ్యులతో కూడిన టీంను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

టమాటో ఫ్లూ లక్షణాలు ఏంటి?ఈ వ్యాధి సోకిన పిల్లల్లో గుర్తు తెలియని జ్వరం కనిపిస్తుంది. శరీరంపై దద్దుర్లు, ఎర్రటి బొబ్బలు వస్తుంటాయి. అందుకే దీనిని టమాటో ఫ్లై అంటున్నారు. పిల్లలు డీహైడ్రేషన్ కు గురవుతారు. వీటితోపాటు దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విపరీతమైన నీరసం, కడుపునొప్పి వంటివి ఉంటాయి.

అయితే టమాటో ఫీవర్ వైరల్ ఫీవరా? కాదా? అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే దానికి ఖచ్చితమైన కారణాలు తెలియలేదు. ఇది కొత్త వైరల్ ఇన్ఫెక్షనా? డెంగ్యూ , చికెన్ గున్యా వ్యాధుల అనంతర ప్రభావమా? అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది.

పిల్లలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News