దేశ అప‌ర కుబేరుల్లో డామినేష‌న్ ఎవ‌రిదంటే?

Update: 2017-07-08 15:19 GMT
తెలుగోడు పీవీ న‌ర‌సింహ‌రావు ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత స‌రళీకృత ఆర్థిక‌విధానాల కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. పీవీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో దేశంలోకి పెద్ద ఎత్తున బ‌హుళ జాతి సంస్థ‌లు.. ప్రైవేటు కంపెనీలు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచే దేశంలో ఆర్థిక‌వృద్ధి అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కాదు.. ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార‌టానికి అవ‌స‌ర‌మైన ముడి ఇంధ‌నం పీవీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో మొద‌లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నాటి నుంచిపెరుగుతున్న సంప‌న్నుల జాబితా.. ఈ రోజు ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందో తెలిసిందే. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో మ‌నోళ్లు కూడా చేరిపోయిన ప‌రిస్థితి. ఫార్మా.. ఐటీ రంగాల‌తో పాటు ప‌లు రంగాల్లో త‌మ ముద్ర‌లు వేస్తున్న భార‌తీయ పారిశ్రామిక‌వేత్త‌లు ఎంద‌రో. ఇదిలా ఉంటే.. దేశంలో అప‌ర కుబేరులైన టాప్ 30 మంది సంప‌న్నుల జాబితాను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు క‌నిపిస్తాయి. ఈ 30 మందిలో ఎక్కువ‌గా నార్త్ వారు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో నార్త్‌.. సౌత్ అన్న లెక్క‌లు ఎక్కువ అవుతున్న వేళ‌.. సంప‌న్నుల జాబితా ఆస‌క్తిక‌రంగా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

టాప్ 30 సంప‌న్నుల జాబితా చూస్తే..

1. ముకేశ్ అంబానీ : రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సీఎండీ. 57 ఏళ్లు. సంప‌ద 21 మిలియ‌న్ డాల‌ర్లు

2. దిలీప్ సంఘ్వీ   :   స‌న్ ఫార్మా అధినేత.. 59 ఏళ్లు.. 20 బిలియ‌న్ డాల‌ర్లు

3. అజీమ్ ప్రేమ్ జీ :   విప్రో వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్‌. 69 ఏళ్లు.. 19.1 బిలియ‌న్ డాల‌ర్లు

4. శివ నాడార్          :  ఐసీఎల్ టెక్నాల‌జీస్ ఛైర్మ‌న్‌. 69 ఏళ్లు. 14.8 బిలియ‌న్ డాల‌ర్లు

5. ల‌క్ష్మి మిట్ట‌ల్       :   ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ సీఈవో. 64 ఏళ్లు. 13.5 బిలియ‌న్ డాల‌ర్లు

6. కుమార మంగ‌ళం బిర్లా: ఆదిత్యా గ్రూప్ ఛైర్మ‌న్‌. 50 ఏళ్లు. 9 బిలియ‌న్ డాల‌ర్లు

7. ఉద‌య్ కొట‌క్      :  కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ఛైర్మ‌న్‌. 55 ఏళ్లు. 7.2 బిలియ‌న్ డాల‌ర్లు

8.  గౌత‌మ్ అదానీ     :   అదానీ గ్రూప్ ఛైర్మ‌న్‌. 52 ఏళ్లు. 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

9.  సునీల్ మిట్ట‌ల్     :  ఎయిర్ టెల్ ఛైర్మ‌న్‌. 57 ఏళ్లు. 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

10. సైర‌స్ పూనావాలా:  సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్య‌వ‌స్థాప‌కులు. 73 ఏళ్లు. 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

11. దేశ్ బంధు గుప్తా  :  లుపిన్ వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్‌. 77 ఏళ్లు. 5.8 బిలియ‌న్ డాల‌ర్లు

12. సావిత్రి జిందాల్   :  జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ లిమిటెడ్. 65 ఏళ్లు. 5.3 బిలియ‌న్ డాల‌ర్లు

13.  మిక్కీ జ‌గ్తియాని    :  ల్యాండ్ మార్క్. 63 ఏళ్లు. 5.2 బిలియ‌న్ డాల‌ర్లు

14. ఆదీ గొద్రెజ్            :  గోద్రెజ్ ఛైర్మ‌న్‌. 75 ఏళ్లు. 4.8 బిలియ‌న్ డాల‌ర్లు

15. జమ్షెడ్ గోద్రెజ్ ఫ్యామిలీ: గోద్రెజ్ అండ్ బోయ్స్ ఛైర్మ‌న్. 66 ఏళ్లు. 4.8 బిలియ‌న్ డాల‌ర్లు

16. శ‌శి అండ్ ర‌వి రుయా: ఎస్సార్ గ్రూప్. 77 ఏళ్లు.. 68 ఏళ్లు. 4.5 బిలియ‌న్ డాల‌ర్లు

17.  సుభాష్ చంద్ర       :  జీ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎంట‌ర్ ప్రైజెస్ ఛైర్మ‌న్‌. 64 ఏళ్లు. 4.2 బిలియ‌న్ డాల‌ర్లు

18. వేణుగోపాల్ బంగూర్ : శ్రీ‌సిమెంట్ ఛైర్మ‌న్‌. 83 ఏళ్లు. 4.1 బిలియ‌న్ డాల‌ర్లు

19. అనిల్ అంబానీ         :  రిల‌య‌న్స్ గ్రూప్ ఛైర్మ‌న్‌. 55 ఏళ్లు. 4 బిలియ‌న్ డాల‌ర్లు

20. విక్ర‌మ్ లాల్                :  ఐష‌ర్ మోటార్స్ సీఈవో. 75 ఏళ్లు. 3.9 బిలియ‌న్ డాల‌ర్లు

21.  పంక‌జ్ ప‌టేల్            : క‌్యాడిలా హెల్త్ కేర్ సీఎండీ. 62 ఏళ్లు. 3.9 బిలియ‌న్ డాల‌ర్లు

22. బ్ర‌జ్ మోహ‌న్ లాల్ ముంజ‌ల్‌: హీరో హోండా మోటార్స్. 92 ఏళ్లు(మ‌ర‌ణించారు). 3.8 బిలియ‌న్ డాల‌ర్లు

23. మంగ‌ల్ ప్ర‌భాత్ లోథా : లోథా గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కులు. 59 ఏళ్లు. 3.4 బిలియ‌న్ డాల‌ర్లు
 
24. కుశాల్ పాల్ సింగ్‌:  డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మ‌న్‌. 83 ఏళ్లు. 3.4 బిలియ‌న్ డాల‌ర్లు

25. సుధీర్‌.. స‌మీర్ మెహ‌తా: టొరెంట్ ఫార్మా ఛైర్మ‌న్‌.. సీఈవో. 58 ఏళ్లు. 3.3 బిలియ‌న్ డాల‌ర్లు

26.  క‌ళానిధి మార‌న్          : స‌న్ గ్రూప్ ఛైర్మ‌న్. 53 ఏళ్లు. 4.5 బిలియ‌న్ డాల‌ర్లు

27. బాబా క‌ల్యాణి              : భార‌త్ ఫోర్జ్ కంపెనీ ఛైర్మ‌న్‌. 66 ఏళ్లు. 2.6 బిలియ‌న్ డాల‌ర్లు

28. ర‌జ‌న్ ర‌హేజా              : ర‌హేజా గ్రూప్ ఛైర్మ‌న్‌. 60 ఏళ్లు. 2.6 బిలియ‌న్ డాల‌ర్లు

29. రాహుల్ బ‌జాజ్           : బ‌జాజ్ గ్రూప్ ఛైర్మ‌న్‌. 76 ఏళ్లు. 2.5 బిలియ‌న్ డాల‌ర్లు

30. ఎంఏ యూస‌ఫ్ అలీ      :  లులు గ్రూప్ అధినేత‌. 59 ఏళ్లు. 2.5 బిలియ‌న్ డాల‌ర్లు
Tags:    

Similar News