కెనడాలో 215 మంది పిల్లల అవశేషాలు బట్టబయలు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 1978లో మూసివేయబడిన బ్రిటిష్ కమ్లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ పిల్లల ఆస్తిపంజరాల వివరాలని కనుగొన్నారు. అందులో చాలా మంది మూడేళ్ల వయసు ఉన్నట్లు గుర్తించారు. ఈ అవశేషాలు భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ స్పెషలిస్ట్ సహాయంతో కనుగొన్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నప్పుడు 4,100 మంది పిల్లలు మరణించినట్లు వెల్లడైంది. అయితే ఇందులో 215 మంది పిల్లల వివరాలు చేర్చబడలేదని గుర్తించారు.
ఒకప్పుడు కెనడాలో అతిపెద్ద రెసిడెన్షియల్ పాఠశాలగా ఉన్న మైదానంలో వీరిని ఖననం చేసినట్లు కనిపెట్టారు. ఈ ఘటన దేశ చరిత్రలో చీకటి రోజు అని ఆ దేశ ప్రధాని ట్రూడో చెప్పారు. అయితే 1840 నుంచి 1990 వరకు క్రైస్తవ చర్చిలు నిర్వహిస్తున్న పాఠశాలలకు హాజరైన 150,000 మంది పిల్లలలో చాలా మంది భయంకరైన శారీరక వేధింపులు, అత్యాచారాలు, పోషకాహారలోపం మరియు ఇతర దురాగతాలను నివేదిక నమోదు చేసింది. అయితే 2008లో కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు అధికారంగా క్షమాపణలు చెప్పింది. అయితే బ్రిటీష్ కొలంబియా కార్యాలయంతో కలిసి దర్యాప్తు కొనసాగుతుందని, లభ్యమైన అవశేషాలు భద్రపరుస్తామని అధికారులు వెల్లడించారు.