ఫోన్ చేస్తే రైల్ టిక్కెట్ క్యాన్సిల్..?

Update: 2015-12-29 04:56 GMT
ట్రైన్ టిక్కెట్టు క్యాన్సిల్ చేయాలంటే.. ఏముంది? ఇలా వెళ్లి అలా ఆన్ లైన్ లో క్యాన్సిల్ చేస్తే సరిపోతుందని చెబుతారు. కానీ.. అందరూ ఆన్ లైన్లో టిక్కెట్టు కొనరు. ఆన్ లైన్లోకాకుండా.. రైల్వే స్టేషన్ కు వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు.. తమ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకోవాలంటే దగ్గరున్న రైల్వే స్టేషన్ కు పరిగెత్తాలి. ఇక.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారు తమ టిక్కెట్టును క్యాన్సిల్ చేసుకోవటం చాలా తలనొప్పి.

అయితే.. ఈ బాధల నుంచి రైలు ప్రయాణికుడు విముక్తి కానున్నాడు. జనవరి 26 నుంచి రైల్వే శాఖ రైల్వేటిక్కెట్ క్యాన్సిలేషన్ కు సరికొత్త పద్ధతిని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానంతో టిక్కెట్టును క్యాన్సిల్ చేయటం చాలా సులువు. కేవలం ఫోన్ కాల్ తో టిక్కెట్టు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక.. రిఫండ్ మొత్తాన్ని కాస్త వీలు చూసుకొని రైల్వే స్టేషన్ కు వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు ఉంది.

ఇంతకీ.. ఫోన్ ద్వారా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకునే పద్ధతి ఎలా అంటే..

1. టిక్కెట్ క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు 139 నెంబర్ కు ఫోన్ చేయాలి.

2. రిజర్వేషన్ అప్లికేషన్ లో పేర్కొన్న మొబైల్ నెంబరును చెప్పాలి.

3. ఆ వెంటనే.. సదరు మొబైల్ నెంబరుకు వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది.

4. ఆ పాస్ వర్డ్ ను రైల్వే ప్రతినిధికి చెప్పేస్తే టిక్కెట్ క్యాన్సిలేషన్ ను కన్ఫర్మ్ చేస్తారు.

5. క్యాన్సిల్ చేసుకున్న టిక్కెట్ కు సంబంధించి రిఫండ్ మొత్తాన్ని వాపసు తీసుకోవటానికి టైం చూసుకొని రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లి తెచ్చుకోవచ్చు.
Tags:    

Similar News