కరోనాతో ఎమ్మెల్యే మృతి!
దేశంలో మహమ్మారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు పేదోడు నుంచి పెద్దోడు దాకా అందరినీ పట్టి పీడిస్తోంది. వైరస్ ధాటికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వైరస్ బారినపడి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ మృతి చెందారు.
గత కొన్ని రోజులుగా ఈ వైరస్ కారణంగా బాధపడుతున్న ఘోష్.. ఇవాళ ఉదయం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తమోనాష్ ఘోష్ తమను వీడి పోవడం తీవ్ర విషాదం నింపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ బుధవారం ట్వీట్ చేశారు. 35 ఏళ్లపాటు ప్రజల కోసం పనిచేసిన తమోనాష్ ఘోష్ తమను వీడిపోవడం తీవ్ర విచారం కలిగించిందని సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌గా పనిచేస్తున్నారని, తమది 35 ఏళ్ల అనుబంధం అని, ప్రజలు, పార్టీ కోసం ఆయన శ్రమించారని, సమాజ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని మమతా బెనర్జీ తెలిపారు. తమోనాష్ ఘోష్ లేని లోటు తీరనిదని, ఆయన భార్య ఝార్నా, అతని ఇద్దరు కూతుళ్లు, బంధుమిత్రులకు సీఎం సంతాపం తెలిపారు.