ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై యూపీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పురుషులు కేవలం వాంఛ తీర్చుకోవడానికే భార్యకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భార్యలను మార్చేందుకే ఇదంతా చేస్తున్నారని, తలాక్ లకు తలాతోకా లేదని మౌర్య అన్నారు. ముస్లిం భర్తలు తలాక్‌లతో వదిలేసిన భార్యాపిల్లలు వీధుల్లో అడుక్కు తినాల్సి వస్తున్నదని వ్యాఖ్యానించారు.
యూపీలోని బస్తీలో స్థానిక బీజేపీ నేత ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మౌర్య విలేకరులతో మాట్లాడారు. ‘‘తలాక్ లకు ఆధారమేదీ లేదు. తమ వాంఛలను తీర్చుకోవడానికి మాత్రమే కొందరు భార్యలను మారుస్తూ.. సొంత భార్యాపిల్లలను వీధుల్లో యాచించేలా చేస్తున్నారు. ఇది సరైనదని ఎవరూ చెప్పరు.’’ అని మౌర్య వ్యాఖ్యానించారు. అన్యాయంగా తలాక్ ఇచ్చి వదిలేసిన ముస్లిం మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని యూపీ మంత్రి హామీ ఇచ్చారు.కాగా మౌర్య వ్యాఖ్యలపై విపక్షాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. మౌర్య తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ అన్నారు. మౌర్య క్షమాపణలు చెప్పాలని ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్ బీ)’ ప్రతినిధి మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగిమహ్లి డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎండబ్ల్యూపీఎల్ బీ) అధ్యక్షురాలు షైస్టా అంబర్ నిరసన వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచిన మంత్రిపై ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల సంఘం కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/