భార్య‌ను చంపొద్దు కాబ‌ట్టే..త‌లాక్ ఇస్తున్నారు

Update: 2018-07-23 14:10 GMT
వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామా అనే పేరున్న స‌మాజ్‌ వాదీ పార్టీకి చెందిన నేత రియాజ్ అహ్మద్ మ‌రోమారు అదే కామెంట్లు చేశారు. బీజేపీ నేతలు వరుణ్ గాంధీ - మనేకా గాంధీలపై స్పందిస్తూ.. ఈ ఇద్దరూ ఫిల్‌ బిత్ ఓటర్లను కండోమ్స్‌ లా వాడుకుంటున్నారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన రియాజ్ తాజాగా త‌లాక్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్‌ ను నిషేధిస్తూ చేసిన బిల్లును లోక్‌ సభ ఆమోదించగా.. రాజ్యసభలో అది ఇంకా పెండింగ్‌ లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ భార్యను చంపాల్సిన అవసరం రావద్దనే ఆమెకు మూడుసార్లు తలాక్ చెబుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.

బరేలీలో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌ వాదీ పార్టీ నేత రియాజ్ మాట్లాడుతూ...మూడుసార్లు తలాక్ చెబుతున్నది భార్యను చంపాల్సిన అవసరం రావద్దనే యోచ‌న‌లోనే అని అన్నారు. `` ఓ భార్య తన భర్తను మోసం చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకుంటే అతడు ఏం చేస్తాడు? భార్యను చంపాలి లేదా ట్రిపుల్ తలాక్ చెప్పాలి కదా?. అందుకే ఆమెను చంపకూడదనే తలాక్ చెబుతున్నారు`` అని రియాజ్ కామెంట్లు చేశారు. ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా 8 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని నిజంగా అనిపిస్తే రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. ఇక ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్‌ పై స్పందిస్తూ.. ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. రియాజ్ సమాజ్‌వాదీ పార్టీ మైనార్టీ సెల్ చీఫ్‌గా ఉన్నారు.
Tags:    

Similar News