మునుగోడు ఫలితాల్లో ఆసక్తికర పరిణామం

Update: 2022-11-06 16:46 GMT
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో గెలిచేసింది.  దాదాపు 10వేలకు పైగా మెజార్టీతో 14వ రౌండ్ ముగిసేసరికి ఉంది. గెలుపు ఖాయం కావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. మరోవైపు టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి గెలిచిందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కనీసం ప్రచారం చేసుకోనివ్వలేదన్నారు. టీఆర్ఎస్ ది అధర్మ గెలుపు అన్నారు.

ఇక ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. కోమటిరెడ్డికి బలం కలిగిన చౌటుప్పల్ లో టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చింది. ఇది తాను ఊహించలేదని కోమటిరెడ్డి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేవారు.

ఇక తాజాగా వెల్లడైన చండూరు ప్రాంత ఫలితాల్లోనూ కారు గుర్తుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇది తొలి నుంచి పాల్వాయి కంచుకోట కాగా.. ఇటీవల కోమటిరెడ్డికి ఇక్కడ బలం పెరిగింది.

ఇక టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి తాజాగా సొంత గ్రామస్థులే షాక్ ఇచ్చారు. ఆ గ్రామంలో బీజేపీ అభ్యర్థి  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి కంటే ఆధిక్యత లభించడం సంచలనమైంది. దీంతో బయట గెలుస్తున్న ప్రభాకర్ రెడ్డి ఇంట మాత్రం ఓడిపోతుండడం హాట్ టాపిక్ గా మారింది.

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలో లింగవారిగూడెం ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం. సుమారు 600 వరకూ జనాభా ఉంటుంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి స్వగ్రామంలో అభివృద్ధి చేయలేదని..  అందుకే ఓటర్లు షాక్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఆ ఊరివాళ్లు ఆడిపోసుకుంటున్నారు.
Tags:    

Similar News