కారుతో జత కట్టిన వారసులకే గెలుపు

Update: 2016-02-06 04:14 GMT
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లోఆసక్తికర కోణం ఒకటి కనిపించింది. గ్రేటర్ బరిలో పలువురు వారసులు దిగినా గెలుపు మాత్రం తెలంగాణ అధికారపక్షం వెంట ఉన్న వారికే దక్కటం గమనార్హం. గ్రేటర్ పరిధిలోని డివిజన్లలో తమకు తిరుగులేని పట్టు ఉందని భావించిన పలువురు పెద్దలకు షాకుల మీద షాకులు తగిలాయి. గ్రేటర్ పరిధిలో మంత్రి పదవిని పదేళ్ల పాటు అనుభవించిన కాంగ్రెస్ నేత ముఖేశ్ గౌడ్ తన కుమారుడ్ని ఒక డివిజన్ నుంచి కూడా గెలిపించుకోలేకపోవటం చూస్తే.. గులాబీ సునామీ ఏరేంజ్లో ఉందో ఇట్టే అర్థమవుతుంది.

కొడుకు ఓటమి షాక్ సరిపోనట్లు ముఖేశ్ గౌడ్ కు మరో షాక్ తగిలింది. గన్ ఫౌండ్రీ నుంచి బరిలోకి దిగిన ఆయన కుమార్తె శిల్పా గౌడ్ సైతం కార్పొరేటర్ గా గెలవకపోవటం గమనార్హం. ఇక.. హైదరాబాద్ టైగర్ గా చెప్పుకునే దివంగత ఆలె నరేంద్ర సతీమణి ఆలె లలిత గౌలిపుర డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. వీరే కాదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖుల వారసులు.. కుటుంబ సభ్యులు.. బంధువులు.. అందరూ ఓటమిబాట పట్టిన వారే.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వారసుల విషయంలో విపక్షాలకు ఏ మాత్రం కలిసి రాకపోయినా.. అధికారపార్టీకి మాత్రం అదో ఆభరణంగా మారింది. గులాబీ సునామీలో వారంతా సునాయాసంగా విజయం సాధించారు. అధికార పార్టీ నుంచి విజయం సాధించిన వారసుల్ని చూస్తే..

= రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి

= హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి

= పీజేఆర్  కుమార్తె విజయారెడ్డి

= టీడీపీ ఎమ్మెల్యేగా సుపరిచితుడు.. టీఆర్ఎస్ లో చేరిన సాయన్న కుమార్తె లాస్య

= ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి
Tags:    

Similar News