తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని కాంగ్రెస్ నేత - కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించడంపై టీఆర్ ఎస్ శ్రేణులు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై-ఉద్యమ నాయకుడు కేసీఆర్ పై జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ - మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు - ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకాలం నాటి సంఘటనల గురించి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షం కాబట్టి కాంగ్రెస్ నేతగా ఎదో మాట్లాడాలని మాట్లాడుతున్న జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలి పెడుతున్నామని తెలిపారు. "కేంద్ర మంత్రిగా తెలంగాణా ఉద్యమంలో పాల్గొనకుండా తాను జాతీయ వాదిని అని ప్రకటించుకున్నది జైపాల్ కాదా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎపుడైనా తెలంగాణ పై జైపాల్ చర్చించారా? కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయకుండా ప్రజాక్షేత్రం నుంచి పారి పోయింది జైపాల్ కు తెలియదా ? ఉద్యమంలో కాంగ్రెస్ నేతలను గ్రామాలకు రానివ్వని సంగతి తెలియదా తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు అయిన తర్వాత ఇపుడు జైపాల్ ఉద్యమం సంగతి మాట్లాడటం ఏమిటీ ?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
జైపాల్ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి జైపాల్ కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పనితీరును దేశమంతా ప్రశంసిస్తోందని, దేశంలో ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అని సూటిగా నిలదీశారు. భారత దేశ ప్రధాని - ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్-టీడీపీలు కలిసి పోటీ చేసినా ప్రతి ఎన్నికలో టీఆర్ ఎస్సే గెలిచిందని ఇక ముందు కూడా డిపాజిట్ లు రావనే ఆందోళనతో కాంగ్రెస్ నేతలు నోటి కొచ్చిన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలవి జనావేదన సభలు కావు..కాంగ్రెస్ ఆవేదన సభలని ఎద్దేవా చేశారు .ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడటానికి ఎం లేదు కాబట్టే అనవసర విషయాల పై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని టీఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ వేగంగా సాగుతోందని అయినప్పటికీ జేఏసీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఉద్యోగాలే భర్తీ కానట్టు కొందరు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఇప్పటికే 28 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కాంగ్రెస్ & టీడీపీలతో కలిసి పోయి కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విమర్శించారు. బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణాలో అందరు ఆహ్వానించాలని కోరారు. కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తన నోటి ని అదుపులో పెట్టుకుంటే మంచిదని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ప్రజల మద్దతు తో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారే అనే సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/