అమ్ముల పొదిలో ఉన్న అయుధాన్ని ప్రయోగిస్తే ప్రత్యర్థుల తాట తీస్తుంది? కానీ.. అందుకు భిన్నమైన అనుభవం తాజాగా తెలంగాణ అధికారపక్షానికి ఎదురైంది. దూకుడుతో ఎంతటి శక్తివంతమైన ప్రత్యర్థిని అయినా సరే ఉక్కిరిబిక్కిరి చేయటం.. తాము చేసే వాదనలో లాజిక్కుల్ని కుప్పలు కుప్పలుగా పోయటం.. దానికి భావోద్వేగాల్ని రంగరించటం లాంటి తెలివైన ఎత్తుగడలతో ప్రత్యర్థుల్ని చెడుగుడు ఆడుకునే టీఆర్ ఎస్ నేతలు తొలిసారి తప్పటడుగు వేశారు. విమర్శించాలనే తొందరలో ఆలోచనతో టార్గెట్ చేయటాన్ని వదిలేసి ఆవేశాన్ని నమ్ముకున్నారు. అదే వారి పాలిట శాపంగా మారిందని చెప్పాలి.
గడిచిన రెండు రోజులుగా తెలంగాణ అధికారపక్ష నేతలు కిందామీద పడుతున్న పరిస్థితి. తాము చేసే వ్యాఖ్యల్ని తిరిగి చూసుకోవటం.. క్రాస్ చెక్ చేసుకోవటం.. తమ మాటల కారణంగా తమకు జరిగిన నష్టం గురించి సమీక్షించుకోవటం లాంటి అలవాట్లు లేని తెలంగాణ అధికారపక్షానికి తాజాగా అలాంటి కొత్త.. కొత్త అనుభవాలు ఎరుకలోకి వస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం విషయంలో టీఆర్ ఎస్ నేతల తొందరపాటు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల పాలనను ఘనంగా ముగించామని జబ్బులు చరుచుకుంటూ.. తెలంగాణలో మరింత బలపడినట్లుగా భావిస్తున్న వేళ.. ప్రొఫెసర్ కోదంరాం తనదైన శైలిలో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.
నిజానికి ఆయన చేసిన విమర్శల్ని మీడియా కవర్ చేసింది చాలా తక్కువే. కవర్ చేసిన వార్తల్ని చూస్తే.. అవన్నీ టోన్ డౌన్ చేసినట్లుగానే ఉన్నాయే కానీ మాష్టారి మాటలంత పవర్ ఫుల్ గా లేవు. కానీ.. ఆ చిన్న విమర్శలకే గులాబీదళం తెగ చెలరేగిపోయింది. కోదండం మాష్టారు చేసిన రెండు.. మూడు విమర్శలకు రోజు వ్యవధిలో డజన్ కు పైగా తెలంగాణ ముఖ్యనేతలు విరుచుకుపడ్డారు. సమస్య అంతా ఎక్కడంటే.. మిగిలిన రాజకీయ నేతల మాదిరి కోదండరాం కాదన్న విషయాన్ని వారు మర్చిపోయారు. సగటు రాజకీయ నేతలకు చెక్ చెప్పేటప్పుడు ఎలాంటి బండ తరహా దూకుడు ప్రదర్శించారో అలాంటి విధానాన్నే మాష్టారి విషయంలోనూ పాటించారే తప్పించి.. ఆయన మాటలకు సమాధానాలన్నట్లగా చెప్పటం.. పెద్దమనిషి తరహాలో మాట్లాడటం లాంటివి ఒక్కరంటే ఒక్కరు చేయలేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కోదండరాం మీద చేసిన ఆరోపణలు టీఆర్ ఎస్ నేతల్ని బాగా నష్టపరిచాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఎలాంటి పదవులు చేపట్టకుండా తనకు తానుగా మిగిలిపోయిన ఒకే ఒక్క పెద్దమనిషి మీద తాము విమర్శలు చేస్తున్నామన్న సోయి లేకుండా మాట్లాడటం వారిని తీవ్రంగా దెబ్బ తీసింది.
ఒక తెలంగాణవాది.. పెద్దమనిషి లాంటి వ్యక్తి మంచిగా నాలుగు మాటలు చెప్పి.. రెండు.. మూడు సూచనలు లాంటి విమర్శలు చేస్తేనే అంతలా రియాక్ట్ కావాలా? మరి.. అంతమంది నేతలు కోదండరాంను టార్గెట్ చేయాలా? టార్గెట్ చేసినా.. అన్నేసి మాటలు అనాలా? లాంటి ప్రశ్నలు తెలంగాణ సమాజంలో మొదలయ్యాయి. తెలంగాణ ప్రయోజనాలకు అసలుసిసలు పరిరక్షకులుగా తెలంగాణవాదులంతా ఫీలయ్యే వ్యక్తి మీద తెలంగాణ అధికారపక్ష నేతలు అంతలావిరుచుకుపడటం ఏమిటన్న ప్రశ్న పలువురిలో ఉదయించటం చూసినప్పుడు.. గులాబీ దళానికి ఇంతకాలం అయుధంగా పని చేసిన దూకుడు.. తొలిసారి భారీగా దెబ్బేసిందని చెప్పక తప్పదు.