అసంతృప్తి షురూ..ట‌వ‌ర్ ఎక్కిన గులాబీ కార్య‌క‌ర్త‌!

Update: 2018-09-07 05:43 GMT
ఇల్లు అల‌క‌గానే పండ‌గ కాద‌న్న‌ట్లుగా.. అసెంబ్లీని ర‌ద్దు చేసి.. మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. ఒకేసారి 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తూ తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లువురు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి అవుతుండ‌గా.. టీఆర్ఎస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల్లో ఆగ్ర‌హ జ్వాల‌లు ఇప్పుడిప్పుడే మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌లు వ‌స్తే గులాబీ కారు అభ్య‌ర్థిగా భావించిన ప‌లువురు నేత‌లు లోలోన ఉడికిపోతున్నారు. కొంద‌రు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌పుడుత‌న్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ తీవ్ర‌త మ‌రింత పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌పై కొన్ని జిల్లాల్లో నిర‌స‌లు మొద‌ల‌య్యాయి. పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నిలో రాహుల్ రెడ్డి అనే కార్య‌క‌ర్త తాజాగా సెల్ ట‌వ‌ర్ ఎక్కి త‌న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సునీల్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌కుండా పార్టీ అన్యాయం చేయ‌టాన్ని తీవ్రంగా ప్ర‌శ్నిస్తున్నారు.

అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ గులాబీ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త సెల్ ట‌వ‌ర్ ఎక్కిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ట‌వ‌ర్ ఎక్కిన రాహుల్ రెడ్డిని కింద‌కు దిగాలని కోరారు. చివ‌ర‌కు పోలీసుల మాట‌ల‌తో రాహుల్ కింద‌కు దిగి వ‌చ్చాడు. అత‌డ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించారు.దీనికి సునీల్ రెడ్డి వ‌ర్గీయులు అడ్డుకోవ‌టంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.


Tags:    

Similar News