తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ గడచిన కొన్నేళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరిత హారాన్ని ఆ పార్టీకి చెందిన నేతే అపహాస్యం చేశాడు. మొక్కను నాటాల్సిన ఆ గులాబీ నేత రెండు కొమ్మలు తెచ్చేసి కనీసం గుంత కూడా తీయకుండా భూమిపై మట్టిని అలా జరిపేసి దానిలో పెట్టేసి... ఆ కొమ్మలు పడిపోకుండా మొక్కలానే కనిపించేలా అటో రాయి, ఇటో రాయి పెట్టేసి కెమెరాలకు ఫోజిచ్చేసి హరిత హారం అయిపోయిందనిపించారు. అయితే సోషల్ మీడియా తనదైన శైలిలో సత్తా చాటుతున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి జిమ్మిక్కులు కుదరవు కదా. ఆ నేత కార్యక్రమాన్ని మమ అనిపించి అటు వెళ్లారో - లేదో... ఇటు ఆ మొక్కను తలపించే కొమ్మలు ఠపీమని కింద పడిపోయాయి. అప్పటికే సదరు నేత వ్యవహారంపై అనుమానం వచ్చిన కెమెరామెన్లు ఈ మొత్తం తతంగాన్ని షూట్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. వెరసి ఆ గులాబీ నేత అడ్డంగా బుక్కయ్యాడు.
ఇలా హరిత హారాన్ని అపహాస్యం చేసిన ఆ గులాబీ నేత ఎవరు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ప్రాంతంలో హరిత హారంలో భాగంగా స్థానిక నేతలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ ఎస్ కు చెందిన గోషా మహల్ నేత మహేందర్ హాజరయ్యారు. అధికారంలో ఉన్నాం కదా... ఏం చేసినా చెల్లుతుందనుకున్నారో - లేదంటే తాను చేసే ఈ తతంగాన్ని ఎవరు మాత్రం పట్టించుకుంటారనుకున్నారో తెలియదు గానీ... గుంత తీసి మొక్కను నాటాల్సిన మహేందర్... ఓ మొక్క చుట్టూ కట్టిన పాదులోనే మట్టిని అలా జరిపేసి అనుచరులు తీసుకొచ్చిన రెండుకొమ్మలను అలా పాతినట్టుగా నిలబెట్టి.. అవి కిందపడకుండా రెండు రాళ్లను సపోర్ట్ గా పెట్టారు.
హరిత హారం అయిపోయిందని తనకు తాను చెప్పుకున్న ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహేందర్ అటు వెళ్లగానే... ఇటు ఆ రెండు కొమ్మలు కింద పడిపోయాయి. ఈ మొత్తం తతంగాన్ని కెమెరాలో బంధించేసిన కొందరు దానిని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ గా మారిపోయింది. మహేందరా... ఇదేం హరితహారం బాసూ అంటూ నెటిజన్లు ఆయనను తెగ ట్రోల్ చేస్తున్నారు. హరిత హారాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తున్న కేసీఆర్ ఈ వీడియోను చూస్తే మరి మహేందర్ పరిస్థితి ఏమిటో చూడాలి మరి.