ఫోర్బ్స్ జాబితాలో 298 స్థానాలను కోల్పోయిన ట్రంప్ .. ఎన్నో స్థానమంటే ?

Update: 2021-04-08 02:30 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆస్తుల విలువ ఏకంగా 1బిలియన్ డాలర్లమేర తగ్గినట్టు అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. 2021కి సంబంధించి ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. 2017కు సంబంధించిన ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన 1001వ స్థానంలో ఉండగా, 2.4 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో ట్రంప్ ప్రస్తుతం 1,299వ స్థానానికి దిగజారారు. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగేళ్ల కాలంలో ఆయన ఆస్తుల విలువ 1బిలియన్ డాలర్ల వరకు తగ్గినట్టు ఫోర్బ్స్ తెలిపింది.

ఇక ఇదిలా ఉంటే ..  ఏడాది లో ఒకసారి ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాభితాను విడుదల చేస్తుంది.  ఏడాదికి ఒకసారి ఈ సంస్థ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని సంపన్నుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది రూ.7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని లెక్క కట్టింది. ఇలాంటివారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మంది ఉన్నారని వెల్లడించింది. టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు సంపాదించగా.. భారతీయ వ్యాపార ప్రముఖులు పలువురు జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Tags:    

Similar News