అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఒక సందేహం భారతీయుల్ని వెంటాడి వేధించింది. రిపబ్లికన్ల అభ్యర్థి కానీ అమెరికా అధ్యక్షుడైతే తమ పరిస్థితి ఏమిటని? వారి సందేహాల్ని నిజం చేస్తూ.. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక కావటమే కాదు.. సంచలనం సృష్టిస్తూ ఏకంగా అమెరికా అధ్యక్ష కుర్చీలో కూర్చున్నారు.
ఎన్నికల వేళలో తాను ఇచ్చిన హామీల్ని నెరవేర్చే క్రమంలో విదేశీయులపై కఠినంగా వ్యవహరించటమేకాదు.. ఉపాధి అవకాశాలపై అమెరికాకు వచ్చే వర్థమాన దేశాల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఫైల్ ను సిద్ధం చేశారు. అమెరికాకు ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారికి ఇచ్చే హెచ్1బీ వీసా విధానాన్ని మార్చేలా నిబంధనల్లో మార్పులపై ట్రంప్ ఈ రోజు సంతకం చేయనున్నారు.
ట్రంప్ కానీ ఈ ఫైల్ మీద సంతకం చేస్తే.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి మాత్రమే అమెరికాకు వచ్చే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు.. ఉద్యోగం కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని.. అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్ భావిస్తున్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే తాను ఇచ్చిన హామీని నెరవేర్చటంతో పాటు.. అమెరికన్ల ఉపాధి అవకాశాల్ని దెబ్బ తీసే విదేశీయులకు పగ్గాలు వేసినట్లుగా అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం అమెరికన్లు సానుకూలంగా స్పందించే వీలుంది. అదే సమయంలో.. భారత్ తో పాటు మరిన్ని దేశాలకు ఈ నిర్ణయం గట్టి షాకేనని చెప్పక తప్పదు.
తాజా ఫైల్ మీద ట్రంప్ సంతకం పెట్టిన అనంతరం అత్యుత్తమ నైపుణ్యం ఉన్న వారికే హెచ్1బీ వీసాల్ని ఇవ్వనున్నారు. వీటిని ప్రత్యేక విధులకే కేటాయిస్తారు. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం ఉన్నత విద్యాభాస్యం చేసి ఉండాల్సి ఉంటుంది. దీనికి తోడు మరిన్ని పరిమితులు అమల్లోకి రానున్నాయి. అయితే.. ఇందుకు శాస్త్రవేత్తలు.. ఇంజినీర్లు.. కంప్యూటర్ ప్రోగ్రామర్లకు మాత్రం పరిమితులు ఉండవు. తాజా పరిణామాల దృష్ట్యా గత ఏడాది కంటే తక్కువ సంఖ్యలో హెచ్1బీ వీసాలకు భారతీయులు అప్లై చేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/