ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ఆదరణ పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం 10 శాతం చార్జీలు పెంచడంతో ప్రయాణికులపై అదనపు భారం పడింది. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినట్టుగానే కిలోమీటరుకు 0.49 పైసలు మేర చార్జీలు వసూలు చేస్తుండగా ఏపీలో 0.59 వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ విభజన అనంతరం రాష్ట్రంలో రవాణా చార్జీలను ప్రభుత్వం పెంచింది. 2014-15 సంవత్సరానికి రూ.595కోట్ల మేర నష్టాలు వచ్చాయని, ఉద్యోగులకు 43 ఫిట్ మెంట్ బెనిఫిట్ కింద చెల్లింపుల కోసం అదనంగా మరో రూ.65 కోట్లు వెరసి రూ.660 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఏపీలో రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలోమీటరుకు రూ.0.59 పైసలు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులకు రూ.0.62 పైసలు పెంచిన చార్జీల ప్రకారం చెల్లిస్తున్నారు.
కాగా ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల్లో మాత్రం చార్జీలు తక్కువ (కిలోమీటర్ కు రూ. 0.49 పైసలు)గానే ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరుకు ఏపీఎస్ ఆర్టీసీ నాన్‌స్టాప్ - ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు రూ.36 నుంచి రూ.42 వరకు వసూలు చేస్తుంటే తెలంగాణ బస్సుల్లో ఇదే మార్గంలో రూ.33కే టికెట్ కొడుతున్నారు. ఏపీలో దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సు చార్జీల్లో కూడా భారీ వ్యత్యాసం ఉంది. గుంటూరు - విజయవాడ మధ్య సూపర్ లగ్జరీ - కడప - కర్నూలు - అనంతపురం నుంచి వచ్చే బస్సుల్లో రూ.49 నుంచి రూ.51 వరకు వసూలు చేస్తుండగా జేఎన్ ఎన్ యుఆర్ ఎం బస్సు రూ.52 - ఇంద్ర బస్సుల్లో ఏకంగా రూ.74 వసూలు చేస్తున్నారు. ఇక దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో మరే రకంగా ధరలు ఉంటాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీలో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగే సర్వీసులలో వసూలు చేసే చార్జీలను పరిశీలిస్తే ఏపిఎస్ ఆర్టీసీ ఏ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోందనేది అవగతమవుతుంది.
విజయవాడ నుంచి హైదరాబాద్ కు గరుడ సర్వీసులో రూ.460 - ఎక్స్ ప్రెస్ లకు రూ.235 - డీలక్స్ సర్వీసుకు రూ.264 - సూపర్ లగ్జరీ బస్సులలో రూ.313 చార్జీ వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం - తిరుపతికి గరుడ సర్వీసులలో రూ.695 - ఒంగోలుకు రూ.247 - చిత్తూరుకు రూ.826 - కడపకు రూ.671 చార్జీలను నిర్ణయించారు. అయితే హైదరాబాద్ సహా తెలంగాణ నుంచి వచ్చే ఏపీ సర్వీసులలో ఇవే ప్రాంతాలకు 10 శాతం తక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు.
పొరుగు రాష్ట్ర సర్వీసులు తక్కువ చార్జీలు వసూలు చేస్తుండటంతో ఏపీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో అంతర్రాష్ట్ర పరస్పర అవగాహన ఒప్పందంలో భాగంగా చార్జీలు పెంచాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా టీఎస్ ఆర్టీసీ మాత్రం చార్జీల పెంపుదల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బస్సులలో ఒక రకంగా, ఏపీ సర్వీసులలో మరో రకంగా చార్జీలు వసూలు చేయటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఏపీ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ బెనిఫిట్లు చెల్లిస్తోందని, రాయితీలు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఏపీలో నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఆ భారాన్ని ప్రయాణికులపై మోపటం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సొంత బస్సుల కంటే పొరుగు రాష్ట్రం బస్సులకే ఆదరణ లభిస్తుండటం ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు కలవరం కలిగిస్తోందని చెప్తున్నారు.