యావత్ భారతం పులికించిన ఘట్టం.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజోత్సవం. ఇంతటి అద్భుత ఘట్టాన్ని దేశంలోని న్యూస్ చానెల్స్ అన్నీ లైవ్ ప్రసారం చేశాయి. ప్రజలందరూ కనులారా వీక్షించారు.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భక్తి చానెల్ ‘ఎస్వీబీసీ’ మాత్రం ఈ అయోధ్య రామ మందిర భూమి పూజను లైవ్ ప్రసారం చేయలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
దీంతో తాజాగా ఈ వివాదంపై టీటీడీ స్పందించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒకటిన్నర వరకు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రసారం చేస్తామని.. కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని.. అందుకే అదే సమయంలో జరిగిన రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని టీటీడీ వివరణ ఇచ్చింది.