ఆపద మొక్కులవాడిగా.. వడ్డీ కాసులవాడిగా కీర్తిస్తూ.. తమకేదైనా కష్టం వస్తే చప్పున గుర్తు తెచ్చుకుంటూ మొక్కుకునే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఎంత సంపన్నుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే.. అత్యంత సంపన్నమైన ఆలయమన్న సంగతి తెలిసిందే. నిత్యం హుండీ ద్వారానే రూ.2కోట్లకు తగ్గకుండా భక్తుల కానుకలు వచ్చే పరిస్థితి.
ఇవి కాకుండా వివిద సేవల రూపంలో వచ్చే ఆదాయంతోపాటు.. హుండీలో వేసే కానుకలు.. బంగారం.. వెండి లాంటి అపురూపమైనవి ఎన్నోనిత్యం స్వామి పేరిట వస్తుంటాయి. ప్రపంచంలో అత్యంత ధనిక దేవుళ్లలో ఒకరైన వెంకన్న దగ్గరున్న బంగారం ఎంతో తెలిస్తే కాస్తంత ఆశ్చర్యంగా అనిపించక మానదు. 2010లో తొలిసారి తన దగ్గరున్న775కేజీల బంగారాన్ని ఎస్ బీఐలో జమ చేసింది టీటీడీ.. ఏడాదికేడాది పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసిన బంగారం 5 టన్నులకు పైగా ఉండటం గమనార్హం.
హుండీలో భక్తుల ద్వారా వచ్చే బంగారాన్ని శుద్ధి చేసి.. బ్యాంకులకు వద్ద టీటీడీ డిపాజిట్ చేస్తోంది. తాజాగా ఇలా బ్యాంకుల్లో నిల్వ చేసిన బంగారం నిల్వలు 5300 కేజీలకు దాటాయి. ఇవి కాకుండా టీటీడీ దగ్గర మరికొంత బంగారం నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం తన దగ్గరున్న బంగారం నిల్వల్ని వేర్వేరు బ్యాంకులకు బదిలీ చేస్తున్న టీటీడీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల కేంద్రం ప్రకటించిన బంగారం డిపాజిట్ మీద మాత్రం టీటీడీ పెద్దగా రియాక్ట్ కాకపోవటం గమనార్హం. బ్యాంకులతో పోలిస్తే.. వడ్డీ అధికంగా వచ్చే అవకాశం ఉన్నా.. కేంద్రం వైపు చూసేందుకు ఇష్టపడకుండా.. బ్యాంకుల వద్దే బంగారాన్ని డిపాజిట్ చేయటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులతో పోలిస్తే.. కేంద్రం మరింత స్ట్రాంగ్ కదా? మరి.. కేంద్రాన్ని పట్టించుకోకుండా బ్యాంకులను ముద్దు చేయటంలో అంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.