మా మీద విషం కక్కుతున్నారంటూ లబలబలాడిపోతుంటారు చంద్రబాబు.. పవన్ లు. తామిద్దరం వేర్వేరని.. ఒకరికొకరికి అస్సలు సంబంధం లేదని తెగ మాటలు చెప్పేస్తారు. వారెంతగా బల్లగుద్ది చెబుతారో.. అందుకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా విషయాలు చోటు చేసుకుంటాయి.
ఏపీలో బాబు.. పవన్.. బీజేపీ ఏకమై అధికారపక్షాన్ని ఇరుకున పడేయాలని.. జగన్ కున్న ఛరిష్మాను ఒంటరిగా ఏ శక్తి అడ్డుకోలేని వేళ.. ఉమ్మడిగా దెబ్బ తీయాలని తెర వెనుక కలిసినట్లుగా ప్రచారం సాగుతోంది. దీన్ని ఎవరికి వారు ఖండిస్తుంటే.. బాబు.. పవన్ లు మాత్రం మరికాస్త ఎక్కువగా భుజాలు తడుముకోవటం కనిపిస్తుంది.
అనుమానం నిజమన్నట్లుగా తాజాగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు ఒకే సమయంలో ఒకేలాంటి ట్వీట్ పోస్టు చేయటం ఆసక్తికరంగా మారింది. కాకతాళీయంగా మారిందని అనుకున్నా.. మరీ ఇంత టైమింగా? అన్న సందేహం రాక మానదు.
విజయనగరంలో గాంధీ విగ్రహానికి జగన్ పార్టీ శ్రేణులు తమ పార్టీ జెండా రంగులు వేసిన విషయాన్ని బాబు ట్వీట్ రూపంలో పేర్కొంటే.. సరిగ్గా ఇదే అంశాన్ని పవన్ కల్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ రూపంలో పోస్టు చేశారు. ఇదంతా చూస్తే.. ఒకే తానులో గుడ్డల మాదిరి పవన్.. బాబుల బంధం కనిపించక మానదు. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై తాజా ట్వీట్ మరింత సందేహాన్ని కలిగించేలా చేస్తుందని చెప్పక తప్పదు.