అమెరికాలో అడ్డంగా దొరికిపోయిన ఇండియన్స్

Update: 2017-03-28 07:36 GMT
అమెరికాలో భారతీయులపై నేరాలు పెరిగిపోతున్న వేళ ఊహించని రీతిలో భారీ నేరం చేసి ఇద్దరు భారతీయులు అడ్డంగా దొరికిపోయారు. పెద్ద మొత్తంలో ఆర్థిక నేరానికి పాల్పడడంతో  వారికి జైలు శిక్ష పడింది. దాదాపు 200 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ కార్డు మోసానికి దిగిన విజయ్‌ వర్మ(49) - తర్సీం లాల్‌(78) అనే ఇద్దరికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. వీరికి కోర్టు ఐదువేల డాలర్లను జరిమానా విధించింది.
    
విజయ్ - తర్సీంలు న్యూజెర్సీలో ఓ జ్యూయెలరీ స్టోర్‌ నడుపుతున్నారు.  2013లో ఓ పథకం పేరిట దాదాపు 7000 తప్పుడు చిరునామాలు - అడ్రస్‌ ప్రూఫ్‌ లు పెట్టి దాదాపు వేలల్లో క్రెడిట్‌ కార్డులు రాబట్టి వాటి ద్వారా పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డారు.
    
తప్పుడు చిరునామాలతో సంపాదించిన క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి తమ స్టోర్‌ లోనే స్వైపింగ్‌ చేసి క్రెడిట్‌ లిమిట్‌ మొత్తం తమ ఖాతాల్లోకి వచ్చేలా చూసుకున్నారు. ఇలా 200 మిలియన్‌ డాలర్లు వారి ఖాతాకు జమ అయింది. అయితే, ఆ తర్వాత కార్డు బిల్లులు చెల్లించలేదు. దీంతో బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు బండారం బయటపడింది. వారే క్రెడిట్‌ కార్డులు సృష్టించి వారే ఈ మోసానికి దిగినట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించగా మొత్తం 14 నెలల జైలు శిక్ష వేసింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News