త‌మిళ పేచీ వెనుక ఇద్ద‌రు కేంద్ర‌మంత్రులు

Update: 2017-02-14 14:39 GMT
బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మిళ‌నాడు సంక్షోభం వెనుక ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్నార‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఆరోపించారు. ఆ ఇద్ద‌రు మంత్రులే ప‌న్నీర్ సెల్వంతో తిరుగుబాటు చేయించార‌ని, స‌రైన స‌మ‌యంలో వారి పేర్లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు తీరుపైనా కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మిళ‌నాడు రాజ‌కీయ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని, ఇప్ప‌టికైనా ఆయ‌న తెలివైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి వ్యాఖ్యానించారు.

అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం ఇప్ప‌టివ‌ర‌కు త‌నకు మ‌ద్ద‌తునిచ్చిన ఎమ్మెల్యేల జాబితా ఇవ్వ‌లేద‌ని, కానీ అన్నాడీఎంకే తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ ఇప్ప‌టికే ఇచ్చేశార‌ని ఆయ‌న గుర్తుచేశారు. సాయంత్రం ఆరులోపు ప‌న్నీర్ సెల్వం త‌న జాబితా ఇవ్వ‌క‌పోతే ప‌ళ‌నిస్వామికి గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం క‌ల్పించాల‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి డిమాండ్ చేశారు.

ఇదిలాఉండ‌గా తమిళనాడు ఇన్‌ చార్జి గవర్నర్ విద్యాసాగర్‌ రావుతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి సమావేశం ముగిసింది. సుమారు 40నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రభుత్వం ఏర్పాటుకు పళనిస్వామి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని పళనిస్వామి గవర్నర్‌ కు అందజేసినట్లు సమాచారం. పళనిస్వామి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశమివ్వాలని కోరగా..రాజ్యాంగ విధులకు లోబడి నిర్ణయం ప్రకటిస్తామని గవర్నర్ హామీనిచ్చినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News