కరోనా నుండి కోలుకున్న బ్రిటన్‌ యువరాజు ..!

Update: 2020-03-31 06:51 GMT
బ్రిటన్‌ లోని వేల్స్‌ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌  కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. పాజిటివ్‌గా తేలిన ఏడు రోజుల అనంతరం ఆయన తొలిసారి సోమవారం స్వీయ నిర్బంధం నుంచి బయటకు వచ్చినట్లు రాజప్రతినిధి తెలిపారు. అబెర్డన్‌ షైర్‌ లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి ఆయన బల్మోరల్‌ ఎస్టేట్‌లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నుంచే ఆయన పనిచేస్తున్నట్లు క్లారెన్స్‌ హౌస్‌ తెలిపింది.

కరోనా వెలుగుచూసిన తొలినాళ్లలో ఇదే ప్రిన్స్‌ ఛార్లెస్‌ సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. నమస్తే అని అందరూ పలకరించాలని సూచించారు. అలాంటి వ్యక్తి కరోనా బారిన పడడం వార్తల్లోకి ఎక్కింది. ఆయన భార్య కమిల్లాకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలడం గమనార్హం. 93 ఏళ్ల రాణి ఎలిజిబెత్‌-2ను ఛార్లెస్‌ చివరి సారిగా మార్చి 12న కలిసినట్లు బకింగ్‌హామ్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె భర్త ఫిలిప్‌  ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మరోవైపు బ్రిటన్‌లో కరోనా బాధితుల సంఖ్య 22వేల పైకి చేరగా.. 1400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

Tags:    

Similar News