టీడీపీ నేతలపై, టీడీపీకి అనుకూలంగా ఉండేవారిపై ఏపీ సీఎం జగన్ కక్షసాధిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని....జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఓ సందర్భంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షఉడు, దివంగత నేత నెల్సన్ మండేలాను జగన్ ఆదర్శంగా తీసుకున్నారని....అయితే, మండేలాను ఆదర్శంగా తీసుకొని తనను ఇబ్బంది పెట్టినవారిని కూడా క్షమించగలగాలని ఉండవల్లి హితవు పలికారు. కక్ష సాధించడంపై కాకుండా కేవలం ప్రజా సంక్షేమ పథకాలపై మాత్రమే జగన్ ఫోకస్ చేయాలని...అందుకే జగన్ ను ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్నారని చెప్పారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ...మండేలా చెప్పిన మాటలను మంత్రి బుగ్గను ప్రస్తావించారని, ఆ మాటలను ఉండవల్లి చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పథకాలు ఎలా అమలు చేస్తామని జగన్ ను అడిగితే....మండేలాను గుర్తు తెచ్చుకొని...కమిట్ మెంట్ ఉంటే....అవరోధాలు ఎదుర్కొని సాధించగలమని జగన్ చెప్పారని బుగ్గనను ఉండవల్లి ఉటంకించారు. అయితే, మండేలా జీవితంలోని మరో ముఖ్యమైన ఘటనను కూడా జగన్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మండేలా 27 ఏళ్లు జైలు జీవితం అనుభవించారని...జగన్, గాంధీ, హర్షద్ మెహతా, చార్లెస్ శోభరాజ్ లకు విధించిన జైలు శిక్ష వంటిది కాదని,...27 ఏళ్లు రోజూ బాదడమేనని అన్నారు.
మండేలా జైల్లో ఉన్న దాహానికి నీరడిగితే ఓ జైలర్ మూత్రం పోసేవాడని...అన్ని ఇబ్బందులు పడ్డారని అన్నారు. అయితే, తన ముఖంపై మూత్రం పోసిన జైలర్‌ను.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, మండేలా తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించిన ఘటనను ఉండవల్లి గుర్తు చేశారు. ఆ చరిత్రను జగన్ ఓసారి చదవాలని సూచించారు. తాను దేశాధ్యక్షుడినని, తనకు నల్లవాళ్లు,తెల్లవాళ్లు అంతా ఒకటేనని చెప్పడమే మండేలా ఉద్దేశం అని చెప్పారు. తనను వేధించిన వాళ్లను కూడా గౌరవిస్తానని సంకేతాలివ్వడానికి మండేలా అలా చేశారని, జగన్ కూడా ఆయనను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతీకారాలు, వ్యక్తిగత కక్షలు వద్దని...జగన్ కు తనకు ఓటు వేసిన 86 శాతం ఓటర్లు కనిపించాలని అన్నారు.
అర్జునుడికి పిట్ట కన్ను కనిపించిన మాదిరిగా జగన్ కు ప్రజలు...నవరత్నాలు....ఇవే కనిపించాలని అన్నారు. తనను జైలులో పెట్టించినోడు...వైజాగ్ లో అరెస్టు...చేసినోడు..కనపడకూడదని...ఈ రివేంజులు, వ్యక్తిగత కక్షలు మానేయాలని హితవుపలికారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం నిమ్మగడ్డ చేసిన తప్పని, అది అందరికీ తెలుసని అన్నారు. అయితే, ఆ వ్యవహారంలో జగన్ డైరెక్ట్ గా ఇన్ వాల్వ్ అయి....నిమ్మగడ్డపై బహిరంగ విమర్శలు చేయడం...జగన్ అభద్రతా భావాన్ని బయటపెట్టిందని అన్నారు. అసలు నిమ్మగడ్డ నాలుగేళ్లు పదవిలో ఉంటే జగన్ కు నష్టం ఏమిటని...అన్నారు. ఈ నాలుగేళ్లు అధికారులు జగన్ మాటే వింటారని...నిమ్మగడ్డ మాట వినరని చెప్పారు. అందరూ ఎల్వీ సుబ్రమణ్యంలా ఉండరని...కొందరు నిమ్మగడ్డలు ఉంటారని...హెచ్చరించారు.