జగన్ కు ఉండవల్లి భహిరంగ లేఖ.. !

Update: 2020-07-30 13:30 GMT
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని లేఖలో ఆయన తెలిపారు. కరోనా బారిన పడితే జీవించలేమనే ఆవేదనలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారని చెప్పారు. కరోనా వైరస్ రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలను నడపాలని, దీని కోసం ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ట్రస్టులు, ఎన్జీవోలకు అప్పగించాలని, ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని, ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఇప్పటికే ఒక ఫంక్షన్ హాల్ ను రాజమండ్రిలోని జైన్ సంఘం అద్దెకు తీసుకుందని, అందులో 60 పడకలతో ఒక కరోనా సెంటర్ ను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించాలని, వాటికి ఫీజును నిర్దేశించాలని చెప్పారు. అలాగే, కరోనాపై చేస్తున్న యుద్ధంలో గెలిచేందుకు ముఖ్యమంత్రి జగన్ కు బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Tags:    

Similar News