విభజన చట్టాన్ని ఫాలో అవ్వండి..సీఎంకి ఉండవల్లి లేఖ

Update: 2020-02-22 10:51 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ తాజాగా  మరో లేఖ రాశారు. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయాలన్నీ ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం సరికాదని లేఖలో తెలిపారు . తెలుగు యూనివర్సిటీకి చెందిన మొత్తం 20 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. షెడ్యూల్ పదిలో ఉన్న తెలుగు యూనివర్సిటీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా విభజించుకోలేదని - పేదల ఇళ్ల స్థలాల కోసం తెలుగు యూనివర్సిటీ స్థలాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని...వాటిని తక్షణమే నిలుపుదల చేయాలని లేఖలో సీఎం జగన్‌ ను ఉండవల్లి కోరారు.

కాగా , మాజీ ఎంపీ ఉండవల్లి ..మూడు రోజుల క్రితం కూడా సీఎం జగన్ కి ఒక లేఖ రాసారు. ఆ లేఖ ద్వారా అరుణ్‌ కుమార్‌ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు.  రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోరిక అని - వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ - రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు
Tags:    

Similar News