అందులో వైఎస్ ఫెయిల్యూర్.. మోడీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కే.. ఉండవల్లి వ్యాఖ్యలు

Update: 2021-03-09 05:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటకారితనం.. విషయాల మీద పట్టు.. అవగాహనతో పాటు ఏ విషయమైనా సరే ఇట్టే అర్థమయ్యేలా మాట్లాడే అతి కొద్దిమందిలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా.. తెలుగు ప్రజలకు సంబంధించి విషయాల పరంగానే తప్పించి.. ప్రాంతాల పరంగా కొమ్ముకాయని మేధావి నేతల్లో ఆయన ముందుంటారు. తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ అంశాలతో పాటు.. రెండు తెలుగురాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు.

ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

-  పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని చూసుకొని ఏదో అయిపోయిందనుకోవటం అధికార పార్టీది తప్పే.  టీడీపీ వాళ్లు కూడా మాకిన్నిసీట్లు వచ్చాయంటూ క్లెయిం చేసుకోవటం తప్పే. నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్నది ఇష్యూ. ఇందులో ఎవరు తప్పు చేశారన్నది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇటు వైపు నుంచి అటు వైపు నుంచి తప్పులు జరిగాయి. ఇది ఆరోగ్యకరమైన పోటీ ఎంత మాత్రం కాదు. పార్టీల మధ్య గొడవ ఉండాలి కానీ ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య గొడవేంటి?

-  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఏపీ అధికారపక్షం టార్గెట్ చేసింది కదా? ఆయన హోటల్ కు వెళితే.. కెమేరాలు పెట్టేసి.. నిమ్మగడ్డకు కులాన్ని అంటకట్టి.. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడటం తప్పు. అదే విషయాన్ని గతంలోనే చెప్పా. నిమ్మగడ్డ కూడా మనిషే. ఆయన తప్పు చేస్తే చెప్పాలి. ఇదిగో.. ఈ తప్పులు చేశారని చెప్పాలి. నీ కులాన్ని చూపించి నువ్వు ఏం చేసినా తప్పేననటం సరికాదు.

-  పంచాయితీ ఎన్నికల్ని పార్టీల కోణంలో చూడలేం. అదంతా వ్యక్తిగతం వారు గెలిచిందే తప్పించి పార్టీలకు సంబంధం లేదు. పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం సీట్లు గెలిచేశామనేది కాకిలెక్కలు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

-  బీజేపీ ఫిలాసపీ పెట్టుబడిదారి విధానాన్నిఅనుసరిస్తారు. నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చెప్పారు. సభలో ఆమె చెప్పిన తర్వాత అమ్మకుండా ఎందుకు ఉంటారు. అది వారి విధానం. వారు చెప్పిన తర్వాత ఎందుకు జరగదు? వారు.. వారి పెట్టుబడిదారీ విధానంలో వెళుతున్నారు.

-  విభజన అయిన తర్వాత వారు లెక్కలోకి తీసుకోరు. విభజన సమయంలో ఏం జరిగింది? అన్న ప్రశ్న వేసే దమ్మున్న పార్టీ ఏపీలో లేనప్పుడు.. మనమేం అడుగుతాం. మనకుపాతిక మంది ఎంపీలు ఉండి.. సంఖ్య సరిపోదనుకున్నప్పుడు మనతో వచ్చే వారిని కలుపుకోవాలి. ఒకమీటింగ్ పెట్టుకోవాలి. అసలు భయమేసి చస్తుంటే.. ఇంకెక్కడి మీటింగ్?

-  ప్రత్యేక హోదా ఇవ్వటం లేదంటే అర్థం చేసుకోవచ్చు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయ్యాక కూడా నిధులు ఇవ్వకపోవటం ఏమిటి? అన్నది అర్థం కానిది. ఎన్నికలప్పుడు మోడీని విమర్శించిన ఏకైన నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు మాట వరసకు కూడా విమర్శించటం లేదంటే కారణం.. మళ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం పోతుంది కాబట్టి.

- చంద్రబాబు లేకుంటే పొత్తు పెట్టుకుంటామని బీజేపీ అంటున్నట్లు నా దగ్గర సమాచారం ఉంది. అందుకే మోడీని ఏమనరు.

-  ఏపీ రాజధానిగా అమరావతిని తీర్మానం చేశారు. అప్పుడు ఆన్ రికార్డుగా వ్యతిరేకించమని నేను వైసీపీ పార్టీకి చెందిన సోమయాజుల్ని కలిశాను. ఆయనచాలామందితో మాట్లాడారు. జగన్ ఒప్పేసుకున్నారని చెప్పారు. వ్యతిరేకించే ఆలోచన లేదని చెప్పారు. అమరావతి ఎందుకు పెట్టకూడదనటానికి నావరకు నాకు చాలానే పాయింట్లు ఉన్నాయి.

- అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న వారిని ప్రభుత్వం అసలు పలుకరించకపోవటం.. ప్రభుత్వం తరఫు నుంచి ఎవరూ మాట్లాడకపోవటం నా వరకు అయితే సరికాదనే అనుకుంటున్నా.  

- ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టిన నవరత్నాల అమలు విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు. డబ్బులు వెళుతున్నాయి ప్రతి నెల.  రాజధాని.. పోలవరం..స్టీల్ ప్లాంట్..ఇవేమీ విషయాలు కావు. క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఎంతపెట్టారు అన్నది ముఖ్యం. క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ అంటే.. అసెట్ క్రియేషన్. మన ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే  పని చేయాలి. నెలకు రూ.3వేలు ఇస్తున్నాడు.. బియ్యం ఇస్తున్నాడంటే అదంతా మరింత మెరుగైన జీవనానికి ఉపయోగపడుతుంది.

- ప్రతి నెల కచ్ఛితంగా పంచి పెడుతున్నారు. జీతాలు.. పెన్షన్లు లేటవుతున్నాయి. ఇవి ఆగవు.ప్రతి నెలతప్పనిసరి ఇవ్వాలి. ఏదో ఒక రోజు బబుల్ ఫట్ అంటుంది. బిజినెస్ మ్యాన్ గా జగన్మోహన్ రెడ్డి జీనియస్. వ్యాపారాల్ని ఎలా లైన్లో పెట్టారో చూశాం కదా. ఈ విషయంలో తండ్రి ఫెయిల్యూర్.

-  కాంగ్రెస్ పార్టీ 350 సీట్లు సొంతంగా నెగ్గి.. అధికారంలోకి వస్తే.. వాళ్ల టైంలో ఇచ్చిన హామీ కాబట్టి.. మిగిలిన రాష్ట్రాల వారితో గొడవ పెట్టుకొని అయినా చేసే ప్రయత్నమైనాచేస్తారన్న నమ్మకం ఉంది.

-  వైఎస్ కూతురు. వారసత్వం మనం ఒప్పుకుంటాం. మన నరనరాన ఉంది. ఆవిడ కూడా తెలంగాణ.. ఆంధ్రా తిరిగింది. మాట్లాడుతుంది. ఆవిడ ఖాళీగా ఎందుకు ఉంటుంది. అన్న సీఎంగా ఉన్నాడు. అన్నకు చెల్లెలకు పడటం లేదని వాళ్ల పార్టీ అధికార ప్రతినిధి మొన్నచెప్పారు. ఏవో గొడవలు వచ్చాయి.

-  పదవి ఇవ్వలేదని.. పార్టీ పెడతారని అనుకోలేం. కేసీఆర్ అన్నట్లు పొలిటికల్ పార్టీ పెట్టాలంటే పాన్ డబ్బా పెట్టినంత సులువు కాదన్న మాటను ఒప్పుకోను. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎన్ని వందల కోట్లు పెట్టి పార్టీ పెట్టారు? 2012లో అన్ని సీట్లు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏముంది? జైల్లో ఉండి కూడా అన్ని ఓట్లు వచ్చాయి.

-  ఇప్పుడు స్టేట్ లో రాజశేఖర్ రెడ్డి అన్న బ్రాండే ఉంది. ఎన్టీఆర్ అనే వారి తప్పించి.. పాతవాళ్ల బ్రాండ్ మొత్తం పోయింది. ఆవిడ ఆలోచనలో తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ఉందనుకుంటున్నారేమో.ఆమె ఏమీ లెక్కలు వేసుకోకుండా ఊరికే వచ్చేయరు కదా. రాజ్యసభ సీటు కావాలంటే కేసీఆర్ ఇవ్వరా?వైఎస్ కూతురు వచ్చి రాజ్యసభ పదవి కోరితే ఇవ్వకుండా ఉంటారా?

-  తన కూతురికి.. కొడుక్కి పదవులు ఇచ్చినప్పుడు షర్మిలకు ఇవ్వరా? ఇవాళ పీవీ కుమార్తెకుసీటు ఇచ్చారు. ఎన్నికల చదరంగంలో ఆట ఆడే విషయంలో కేసీఆర్ ఎక్సపర్ట్.

-  రాజకీయ నేతలు బలవంతంగా నెట్టేస్తే తప్పించి.. ఏపీ ఎప్పటికి బిహార్.. ఉత్తరప్రదేశ్ మాదిరి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఇక్కడి ప్రజలు కష్టపడి పని చేస్తారు. తెలివైన వారు. ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాది వారు కష్టపడే గుణం ఎక్కువ.

-  ప్రధాని మోడీని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న లీడర్ దేశంలో ఎవరూ లేరు. ఏమైనా ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే. ఆయనకు ఆ మాటతీరు ఉంది.. ఆలోచనలు ఉన్నాయి. ప్రజలతో కమ్యునికేట్ చేయగలరు. లోపల ఏం లొసుగులు ఉన్నాయో?
Tags:    

Similar News