విమానయాన సంస్థలు ఇటీవల కాలంలో డ్రెస్ ల విషయంలో బాగా పట్టింపుగా ఉంటున్నాయి. దుస్తులు ఏమాత్రం అసభ్యంగా ఉన్నా అలాంటివారిని విమానం ఎక్కకుండా అడ్డుచెబుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ నగరానికి చెందిన విమానాశ్రయంలో ఇలాగే జరిగింది. విమానం ఎక్కాల్సిన కొందరు మహిళలను వారు అసభ్యకరమైన డ్రెస్ లు వేసుకున్నారని అక్కడి సిబ్బంది విమానం ఎక్కనివ్వకుండా ఆపేశారు.
డెన్వర్ నుంచి మిన్నెపోలిస్ కు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో నలుగురు మహిళలను లెగ్గిన్స్ వేసుకున్నారనే కారణంతో విమానంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారట. అందులోని ఓ యువతి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అందరికీ తెలిసింది. వేరే డ్రెస్ వేసుకోండి లేదా లెగ్గిన్స్ పై మరేదైనా డ్రెస్ వేసుకోండి లేకుంటే విమానంలో ప్రయాణించడానికి అనుమతిని ఇవ్వమని చెప్పారట. దీంతో వారిలో ఒక మహిళ లెగ్గిన్ పైనే ఓ డ్రెస్ వేసుకోగానే లోపలికి అనుమతించారట. మిగాతా ముగ్గురు మహిళల వద్ద వేరే డ్రెస్ ఏమీ లేకపోవడంతో వారు వెనుదిరిగారట.
కాగా దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అమ్మాయిలు సౌకర్యం కోసం లెగ్గిన్స్ ఎక్కువగా ధరిస్తారు. అయినా అది సరైన డ్రెస్ ఎందుకు కాదని ట్విట్టర్ లో కామెంట్స్ ల ద్వారా కొందరు అమ్మాయిలు ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఈ విషయం పై స్పందిస్తూ..మంచి డ్రెస్ లు వేసుకొని రాకపోతే ప్రయాణికులను బహిష్కరించే రూల్ ఉందని దాని ప్రకారమే మేము వ్యవహరించామని వెల్లడించింది.కానీ ఎలాంటి దుస్తులు వేసుకురావాలో మాత్రం ఆ సంస్థ చెప్పలేదు.
కాగా ఇంతకుముందు కూడా ఇలాంటి పొట్టి డ్రెస్ ల విషయంలో పలు విమానయాన సంస్థలు ఇలాగే కఠినంగా వ్యవహరించాయి.
* ప్రముఖ డ్యాన్సర్ మెక్ మప్సీన్ పొట్టి దుస్తులతో రావడంతో గత ఏడాది జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించ లేదు.
* 2015లోనూ ఓ పాప్ సింగర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె పిరుదులు కనిపించేలా చిన్న నిక్కర్ వేసుకుని రావడంతో విమానం ఎక్కనివ్వలేదు.
* గత ఏడాది న్యూయార్కులో ఓ భారత సంతతి సిక్కు వ్యక్తి తలపాగాతో వెళ్లగా ఆయన్ను అడ్డుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/