ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసిన 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని మెక్సికో సుందరి ఎగరేసుకుపోయింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పోటీపడిన 73 మంది సుందరాంగులందరినీ వెనక్కునెట్టిన మెక్సికో సోయగం ఆండ్రియా మెజా.. 2020 కిరీటాన్ని సగర్వంగా అలంకరించుకుంది.
అయితే.. ఈ కిరీటం కోసం తీవ్రంగా పోటీఇచ్చిన మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో.. కొద్ది దూరంలో టైటిల్ ను కోల్పోయింది. ఆమె టాప్ 5లో నిలిచింది. ఈ పోటీల్లో కాస్టెలినో నాలుగో స్థానం దక్కించుకుంది. అయితే.. ఇండియన్ కంటిస్టెంట్ ఈ సారి ఖచ్చితంగా కిరీటం దక్కించుకుంటుందని చాలా మంది అంచనా వేశారు. కానీ.. సాధ్యం కాలేదు.
టైటిల్ దక్కకపోయినా ఫుల్ పాపులారిటీ సంపాదించింది కాస్టెలినో. టాప్ 5లో నిలవడంతో.. ఎవరీ అడెలిన్ కాస్టెలినో అని సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇండియన్ అయితే.. విదేశీ పేరులా ఉందేంటీ? అనే డౌట్ కూడా చాలా మందిని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ గురించిన విశేషాలు తెలుసుకుందాం.
వాస్తవానికి అడెలిన్ పుట్టింది మనదేశంలోకాదు. కువైట్ లో జన్మించింది. అయితే.. 15 ఏళ్ల వయసు నుంచి ఇండియాలోనే ఉంటోంది. ముంబైలో నివసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు కర్నాటకలోని ఉడిపి వాసులు. ఆ విధంగా భారతీయ మూలాలు ఉండడం.. ఇండియాలోనే నివసిస్తుండడంతో.. ఇండియన్ కంటిస్టెంట్ గానే బరిలోకి దిగింది.
అడెలిన్ 2020 మిస్ దివా యూనివర్స్ గెలుచుకుంది. దీంతో.. అందరి చూపూ తనవైపు తిప్పుకుంది. ఆ విజయం తర్వాతనే ఇండియా నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు అర్హత సాధించింది. ఈ విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిందని చెప్పొచ్చు. బాలీవుడ్ తారలకు ధీటుగా క్రేజ్ తెచ్చుకుంది.
ఈ 24ఏళ్ల బ్యూటీ.. హిందీ, ఇంగ్లీష్, కొంకణీ భాషలు మాట్లాడగలదు. ఈ ఏడాది 'కింగ్ ఫిషర్ క్యాలెండర్ ది మేకింగ్' అనే డాక్యుమెంట్ సిరీస్ లోనూ మెరిసిందీ బ్యూటీ. ఇప్పుడు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకోలేకపోయినా.. అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.