కర్ణాటక జిల్లాలోని మాండ్య నియోజకవర్గంలో రాజకీయ వేడి తీవ్రమైంది. ఇక్కడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి దివంగత కాంగ్రెస్ నేత, రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత బరిలో ఉండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ ఆమెకు పోటీగా నిలుచున్నారు. నిఖిల్ తరుపున సీఎం ప్రత్యక్షంగా సుమలతపై విమర్శలు చేస్తుండగా అంతేస్థాయిలో సుమలత సైతం సీఎంపై విరుచుకుపడుతున్నారు. బీజేపీ ప్రత్యక్ష మద్దతుతో.. కాంగ్రెస్ పరోక్ష సపోర్టుతో తమదే గెలుపునన్న ధీమాతో స్వతంత్ర అభ్యర్థి సుమలత ముందుకు సాగుతున్నారు.
ఇటీవల సుమలత ఫేస్‌బుక్ ఖాతా బ్లాక్ అయ్యింది. దీంతో మరో ఖాతాను తెరిచిన ఆమె ఆ అకౌంట్ లింక్‌ను అందరికీ షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు పెరుగుతున్న మద్దతు, అభిమానాన్ని చూసి జేడీఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలతో సంబంధం లేకుండా ఉండేందుకు తన ఫేస్‌బుక్ ఖాతాను బ్లాక్ చేయించారని విమర్శించారు. అయితే కొత్త ఖాతాను తెరిచానని ఈ ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువవుతానని సుమలత తెలుపుతున్నారు.
మరోవైపు సుమలత ఖాతాను పునరుద్దరించడానికి సాంకేతిక బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. ఒకవేళ పాత అకౌంట్ ఓపెన్ అయితే రెండు లింకుల ద్వారా సుమలత ప్రచారం చేయనున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియా ద్వారా ఆమెకు విపరీతమైన ఫాలోవర్సు పెరిగారు. ఇందుకు సినీ నటులు కూడా కలిసి రావడం ఆమె అకౌంట్స్‌కు లైక్స్‌తో పాటు కామెంట్లు విపరీతంగా వచ్చాయి.
ఇలా ఫేస్‌బుక్ వేదికంగా ఉధృతంగా ప్రచారం చేస్తున్న తీరును చూసే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన అకౌంట్‌ను బ్లాక్ చేశారని అభ్యర్థి సుమలత విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో గెలవకుముందే జేడీఎస్ నాయకులు ఇలాంటి దారుణాలకు పాల్పడితే అధికారంలో ఉంటే వారి ఆగడాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదంటూ సుమలత ఈ విషయాన్ని కూడా ప్రచారానికి అనుగుణంగా మార్చుకుంటున్నారు.