‘ప్లాస్మా’ ప్రాణాలు నిలపటమే కాదు..తీస్తుందని మళ్లీ తేలింది!

Update: 2020-05-10 08:18 GMT
కొన్ని వైద్య విధానాల మీద వాదోపవాదాలు సాగుతుంటాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అవుననే వారు ఎందరో.. కాదనే వారూ ఉంటారు. తాజాగా ప్లాస్మా చికిత్స మీదా ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. మందులేని మాయదారి రోగానికి ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతున్న వేళ.. ప్లాస్మా పద్దతిలో చికిత్స చేస్తే.. ప్రయోజనం ఉంటుందన్న వాదనను వినిపించటమే కాదు.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

కొన్ని చికిత్సలు ఫలిస్తే.. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి బయటకు వచ్చింది. ఫ్లాస్మా చికిత్సను సంజీవినితో పోల్చటం సరికాదన్న వాదనకు బలం చేకూరే ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఫ్లాస్మా పద్దతిలో చికిత్స పొందిన ప్రభుత్వ వైద్యుడు తాజాగా మరణించారు. 53 ఏళ్ల యూపీ వైద్యుడు.. ఆయన సతీమణి ఇద్దరు పాజిటివ్ గా తేలింది. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేశారు.

వైద్యుడి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ప్లాస్మా పద్దతిలో చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరోగ్యమైన వ్యక్తి నుంచి సేకరించిన రక్తంతో ప్లాస్మా చికిత్సను చేయించుకున్నారు. చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకున్న సదరు వైద్యుడికి అనూహ్యంగా కిడ్నీలు ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో.. ఆయన శనివారం రాత్రి మరణించారు.

అయితే.. ఆయన మరణానికి ముందు పరీక్షలు జరిపితే.. నెగిటివ్ రావటం.. అంతలోనే మరణించటం వైద్యులకు ఇప్పుడీ అంశం ఒక సవాలుగా మారింది. సదరు వైద్యుడికి అప్పటికే షుగర్.. శ్వాససమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్లాస్మా చికిత్సను చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి సీరియస్ కేసుల్లో మరణించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ప్లాస్మా చికిత్స విధానం గతంలో పోల్చినట్లుగా సంజీవినిగా చెప్పటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తర్వాత దేశంలో ఈ విధానంలో చికిత్స చేసిన రాష్ట్రంగా యూపీ నిలిచిందని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News