కోనసీమలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయిపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మంగళవారం (జూలై 26, 2022 ) సీఎం పర్యటించి, బాధితులను ఓదార్చనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జనసైనికులను ముందుగానే గృహ నిర్బంధం చేస్తున్నారు. కొందరికి నోటీసులు ఇచ్చి హెచ్చరించి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రాజమండ్రికి చెందిన జనసైనికులకు టూ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఎటువంటి నిరసనలకూ తావే లేదని స్పష్టం చేసి వెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని పదే పదే హెచ్చరించి వెళ్లారు. అదేవిధంగా ఆయన పర్యటనకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
వాస్తవానికి వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే విపక్ష నాయకులు పర్యటించి వెళ్లారు. చంద్రబాబు సైతం కాలికి బలపం కట్టుకుని రిస్క్ చేసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దీంతో పొలిటికల్ డ్యామేజీని గుర్తించిన జగన్సీ ఎం రోడ్డు మార్గాన ఇక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడనున్నారు.
అయితే అప్పుడెప్పుడో చెప్పిన విధంగా ఆడ పిల్లలకు ఏ కష్టం వచ్చినా గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని అన్నారాయన. కానీ ఇప్పుడు జగన్ కన్నా ముందే గన్ వచ్చిందని ఓ సెటైరికల్ వెర్షన్ వినిపిస్తోంది. తాము నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా అని అంటున్నారు.
గతంలో కూడా శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ ఎక్కడికి ఆయన వచ్చినా ముందస్తుగా విపక్ష నేతలనే టార్గెట్ గా చేసుకుని అరెస్టులు చేయడమో, గృహ నిర్బంధం చేయడమో, లేదా నిరసనలు చేస్తారేమో అని ముందస్తు నోటీసులు ఇచ్చి రాయలేని భాషలో తిట్టి వెళ్లడమో పోలీసులు చేస్తున్నారని, కొన్ని చోట్ల తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ వీడియో రికార్డింగ్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
హై కోర్టు ఇప్పటికే ఇలాంటివి తప్పు పట్టిందని, రాజ్యాంగం ఇచ్చే హక్కుకు విఘాతం కలిగిస్తూ, అదే రాజ్యాంగ స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని, పథకాలు అమలు చేస్తున్నామని ఎలా చెబుతారని విపక్షం ప్రశ్నిస్తోంది.