ఏపీ సీఎం జగన్ రాజకీయ నేపథ్యమే కథాంశంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మిస్తున్న చిత్రం "వ్యూహం"!
ఈ సినిమాలో ఎన్నో సంచలనాత్మక అంశాలు దాగుంటాయట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్‌లో మరణించిన తరువాత రాజకీయంగా పన్నిన కుట్రలు, కుతంత్రాలు, అన్నీ కూడా ఈ సినిమాలో ఆసక్తికరంగా చిత్రీకరించే పనిలో పడ్డారట దర్శకుడు ఆర్జీవీ.
హిట్టా...ఫట్టా అనేదానితో సంబంధం లేకుండా తాను తీసే ప్రతి సినిమాను ఒక సంచలనంగా మార్చగల నైపుణ్యం ఒక్క ఆర్జీవీకే సొంతం. ఆయన ఏం చేసినా ఒక సంచలనమవుతూ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంటుంది. తాజాగా ఆయన వై.ఎస్.జగన్ పైన ఒక సినిమా నిర్మించడానికి పూనుకుని సంచలనం సృష్టించారు. ఈ సినిమాపై ఇప్పటికే పలు రకారల ప్రచారాలు సాగాయి. ఇది జగన్ బయోపిక్ అని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాలను ఆర్టీవీ కొట్టి పారేశారు కూడా. కచ్చితంగా ఇది వై.ఎస్.జగన్‌కు సంబంధించిన చిత్రమేనని, అయితే ఇందులో ఆయన ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు అలాంటి విషయాలేమీ ఉండబోవడం లేదన్నారు. ఇది కేవలం రాజకీయ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమాగా చెప్పుకొచ్చారు.
ఈ సినిమా మొత్తం జగన్ జరిపిన పొలిటికల్ ఫైట్ చుట్టూనే తిరిగేలా కథ రూపొందించారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ జనవరి నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇందులో వై.ఎస్.ఆర్ మరణం, తదుపరి జగన్ కేసులతో జైలుపాలుకావడం, జగన్ జరిపిన పోరాటం తరువాత ఆయన సీఎం అయ్యే వరకు అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఆర్జీవీ చెబుతున్నారు.
అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. జగన్‌ను ఆర్జీవీ తెరపైన ఎలా చూపించబోతున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.