కేరాఫ్ ఉర‌వ‌కొండ : ఆ ఊళ్లో 71.50 ల‌క్ష‌లు మాయం..జ‌గ‌న‌న్న‌పై ఫిర్యాదు

Update: 2022-04-06 05:32 GMT
ఆ ఊళ్లో డ‌బ్బులు మాయం అయ్యాయి. బొత్స భాష‌లో చెప్పాలంటే సొమ్ములు పోనాయి.. విష‌యం తెలిసిన వెంట‌నే నానేటి సేత్తాను అని ఆ ఊరి స‌ర్పంచ్ ఊరుకోలేదు. నేరుగా పోలీసు స్టేష‌న్ కు వెళ్లారు. ఆయ‌నొక్క‌రే కాదు అనుచ‌రుల‌నూ తీసుకువెళ్లారు. యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

త‌న పంచాయ‌తీ ప‌రిధిలో త‌న‌కు తెలియ‌కుండా ఒక‌టి కాదు రెండు కాదు మూడు సార్లు నిధులు గోల్ మాల్ అయ్యాయ‌ని, వీటిని నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులే లాక్కొన్నార‌ని,త‌మ అనుమ‌తి లేకుండా పైస‌లు గుంజుకోవ‌డం ఆర్థిక నేరం అని తెలియ‌దా అని ప్ర‌శ్నిస్తూ సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆ స‌ర్పంచ్ ఏకంగా సీఎంపైనే కేసు ఫైల్ చేయించారు. ఇక న్యాయ పోరాటానికి కూడా తాను సిద్ధ‌మేన‌ని అంటున్నారు. ఇదంతా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా, ఉర‌వ‌కొండ‌లో జ‌రిగింది.

నిన్న‌టి వేళ న‌మోదు అయిన ఘ‌ట‌న. స్థానికంగా సంచ‌ల‌నం అయింది. వైసీపీ నాయ‌కులకు టీడీపీ స‌ర్పంచ్ చేసిన ప‌ని తెలిసి దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయింది. త‌మ పంచాయ‌తీ ఖాతాల నుంచి 71 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కూ లెక్క‌లు చెప్పాల‌ని కూడా ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఈ విష‌యం ఎందాక వెళ్తుందోన‌న్న ఆందోళ‌న వారిలో మొద‌లైంది. ప‌రువు పోయిందిరా దేవుడా అని వీరంతా సీఎం దృష్టికి సంబంధిత పోలీసు కంప్లైంట్ విష‌యాన్ని తీసుకుని వెళ్లారు. కానీ సీఎం సెంటిమీట‌ర్ కూడా చ‌లించ‌లేదు.

ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిధుల గోల్ మాల్ పై టీడీపీతో స‌హా వైసీపీ స‌ర్పంచులూ రోడ్డెక్కే ఛాన్సులు ఉన్నాయి. అయితే తాము అధికారంలో ఉన్నాం క‌నుక అధినాయ‌కత్వానికి త‌లొగ్గే ప్ర‌సక్తే లేద‌ని అంటున్నాయి సంబంధిత వ‌ర్గాలు.

అంతేకాదు స్థానిక ఎన్నిక‌ల్లో గెలుపు అన్న‌ది జ‌గ‌న్ బొమ్మ అడ్డుపెట్టుకుని ద‌క్కింది కాద‌ని చెబుతున్నాయి. శ్రీ‌కాకుళం జిల్లాలో టెక్క‌లి తో స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సర్పంచ్ లు ఇప్ప‌టికే నిధుల విష‌య‌మై అసంతృప్తిలో ఉన్నారు. వీరంతా పార్టీపై తిరుగుబాటు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు.

ఒక్క టెక్క‌లి అనే కాదు శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి నిర‌స‌న‌లే జ‌రిగాయి కూడా ! గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌రిణామాలు ఉండ‌డంతో దీనిపై కేంద్రం జోక్యం అత్య‌వ‌స‌రం అని భావిస్తూ ఎంపీ రామూతో సంబంధిత వ‌ర్గాల‌కు ఫిర్యాదు చేయించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News