ఔను.. ఇప్పుడు వైసీపీ నేతలకు పార్టీ అధిష్టానం నినాదాల టార్గెట్లు విధించింది. ప్రతిజిల్లా నుంచి 10 నినాదాలకు తగ్గకుండా.. ఈ ఏడాది 31 నాటికి.. వాటిని పంపించాలని.. ఐప్యాక్ టీం లీడర్ అధిష్టానం ద్వారా.. పార్టీ నేతలకు సందేశాలు జారీ చేయించారు. ఇప్పటి వరకు జగన్ మాత్రమే వీటిపై దృష్టి పెట్టారు. అయితే, ఈ సారి జిల్లాల వారీగా నినాదాలు రెడీ చేయిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణం గా.. జగన్ వీటిని రూపొందించాలని వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున కొన్ని పాజిటివ్ నినాదాలు తీసుకువచ్చారు. కావాలి జగన్.. రావాలి జగన్ అనే నినాదాన్ని హోరెత్తించారు. పాటలు, కామెంట్ల రూపంలో వీటిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇవి సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అలాగే.. టీడీపీపై వ్యతిరేక నినాదాలు సృష్టించారు. బైబై బాబు.. వంటి నినాదాలను ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లారు. ఇవి కూడా సూపర్ హిట్ కొట్టాయి.
ఇప్పుడు వీటిని మించేలా నినాదాలు కావాలన్నది అధిష్టానం ఆదేశం. అయితే.. గతంలో అంటే.. పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు అధికారంలో ఉంది. సో.. దీనికి తగిన విధంగా నినాదాలను కూర్పు చేయాలని పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం.. వైనాట్ 175 నినాదాన్ని నెమ్మదిగా ప్రజల మధ్యకు తీసుకువెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రచారం కల్పిస్తోంది. అదేవిధంగా వైసీపీ రాకుండా.. పేదలకు పథకాలు కట్ అనేనినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.
అయితే, వీటికి మించి.. ప్రజల నాలుకలపై నిత్యం ఆడేలా.. ఉండే సరికొత్త నినాదాలు కావాలంటూ.. నాయకులకు సమాచారం అందించారు. ముఖ్యంగా జగన్ పథకాలు.. అందుతున్న లబ్ధిని ప్రధానంగా చర్చించేందుకు పార్టీ రెడీ అవుతోంది. వీటిలో అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలను మరింత ఆకర్షణీయంగా ప్రజల్లో చర్చకు పెట్టాలనేది ప్రధాన ఉద్దేశం. ఏదేమైనా.. నినాదాల కోసం.. వైసీపీ చేస్తున్న ప్రయత్నం బాగున్నా.. ఎంత మంది నాయకులు ప్రయత్నంలో పాలుపంచుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.