అమెరికన్స్ ఫస్ట్ నినాదంతో పోయిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు రెండోసారి గెలిచేందుకు అదే విధానాన్ని ఎంచుకోవడం విశేషం. ట్రంప్ తాజాగా స్వదేశీ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. విదేశీయులకు అమెరికాలో తలుపులు మూస్తున్నారు. ట్రంప్ హెచ్1 బీ సహా అన్ని విదేశీ వర్కింగ్ వీసాలు రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో అమెరికాలో ఇక విదేశీయులెవరు అడుగు పెట్టలేరు. కరోనా కమ్మేస్తున్న ప్రస్తుత పరిస్థితులతోపాటు నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా కలలతో ఊరేగే విదేశీయులందరి ఆశలను అడియాసలు చేసింది. అదే సమయంలో అమెరికన్లకే ఉద్యోగాలు దక్కేలా ట్రంప్ చేశారు. విదేశీ నిపుణులకు ఇక అమెరికాలో అడుగుపెట్టడం దుర్లభం కానుంది.
ట్రంప్ తాజాగా హెచ్1బీ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 60 రోజుల పాటు హెచ్1బీ వీసాలను రద్దు చేసిన అమెరికా.. తాజాగా దాన్ని డిసెంబర్ వరకూ పొడిగించింది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హెచ్1 బీ వీసాలతోపాటు హెచ్2బీ, ఎల్1 వీసాలకు దీన్ని వర్తింప చేశారు. పరిస్థితులు మెరుగుపడితే జనవరి నుంచి వీసాలను పునరుద్ధరించే అవకాశం ఉంది.
ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేసే హెచ్2బీ వీసాల జారీలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.వివిధ దేశాల్లోని కంపెనీల మధ్య బదిలీల ద్వారా అమెరికాకు వచ్చే ఉద్యోగులు, వర్కర్లకు ఇచ్చే ఎల్1 వీసాలను డిసెంబర్ వరకు ట్రంప్ రద్దు చేశారు. బుధవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయిన వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. ఇంటర్న్ షిప్, ట్రైనీ, టీచర్లు, క్యాంప్ కౌన్సిలర్ల కు జారీ చేసే జే వీసాలను పరిమితంగా మాత్రమే జారీ చేస్తారు.
కరోనా వైరస్ తో అమెరికా ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది. కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారికి ఉపాధిని కల్పించడం.. దేశీయ కంపెనీలకు ఆర్థికంగా చేయూతను అందించాలనే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా స్వదేశీ వాదంతో ఇక నుంచి విదేశీ కంపెనీలను, విదేశాల సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను, నిపుణులను దేశంలోకి ప్రోత్సహించకూడదని ట్రంప్ డిసైడ్ అయ్యారు.
వచ్చే ఏడాది జనవరి 1 తర్వాతే ఇక ఎవరైనా అమెరికాలో అడుగుపెట్టగలరు. అయితే అదీ అప్పుడు నిబంధనలు సడలిస్తేనే. లేదంటే ఇక అమెరికాలో ఉద్యోగ ఆశలకు విదేశీయులంతా ఆశలు వదులుకోవాల్సిందే..