మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల తన తొలి విదేశీపర్యటన సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసిన ట్రంప్.. మా గొప్పగా పొగిడేశారు. ఓపక్క టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ.. దుర్మార్గానికి పాల్పడుతున్న పాక్ తీరును ఎండగట్టాల్సింది పోయి... అందుకు భిన్నంగా నవాజ్ షరీఫ్ ను పొగిడేసిన తీరు.. హాట్ టాపిక్ గా మారింది. ఓపక్క టెర్రరిజంపై గట్టిగా మాట్లాడిన ట్రంప్.. అందుకు భిన్నంగా షరీఫ్‌ను పొగిడేసిన తీరును అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే.. మొన్న పొగిడారు కాబట్టి.. అదే తీరులో వ్యవహరిస్తుందని అనుకుంటే అగ్రరాజ్యం అనుకోని రీతిలో ఇచ్చిన షాకుతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. పాకిస్థానీయులకు వీసాల జారీ విషయంలో అమెరికా సర్కారు వ్యవహరించిన తీరు ఇప్పుడు పాకిస్థానీయులకు ఏ మాత్రం జీర్ణించుకోలేని తీరుగా మారింది.
పాక్ జాతీయులకు వీసాల జారీలో కఠినమైన పద్దతుల్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి - ఏప్రిల్ నెలల్లో పాక్ జాతీయులకు వీసా మంజూరీ 40 శాతం తక్కువగా ఉండటాన్ని గుర్తు చేశారు. గత ఏడాది మార్చి - ఏప్రిల్ లలో పాక్ కు వీసాల జారీ 40 శాతం తగ్గగా.. అదే సమయంలో భారత్ కు వీసాల మంజూరు 28 పెరిగినట్లుగా చెబుతున్నారు. పాక్ కు ట్రంప్ సర్కారు ఈ ఏడాది మార్చిలో 3973 వీసాలు.. ఏప్రిల్ లో 3,925 వీసాల్ని మాత్రమే మంజూరు చేశారు. ఒబామా సర్కారులో నెలవారీ సగటును చూస్తే 6553 వీసాలు మంజూరు కాగా.. ఇప్పుడు తక్కువనే చెప్పాలి. పాక్ తో సహా.. ముస్లిం ప్రాబల్యం ఉన్న దేశాల్లో వీసాల మంజూరీలో అమెరికా గుట్టుచప్పుడు కాకుండా 20 శాతం మేర కోత పెట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వీసాల జారీ విషయంలో కనిపించకుండానే పాక్ మీద ఏ రీతిలో ఒత్తిడి తీసుకురావాలన్న విషయాన్ని ట్రంప్ సర్కారు ఎఫెక్టివ్ గా అమలు చేస్తున్నారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/